
బీటౌన్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై గత అర్దరాత్రి ఓ దొంగ కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సైఫ్ లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు దాడి చేసిన వ్యక్తి ఎవరనేది తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సైఫ్ పై జరిగిన దాడి ఘటనపై బాలీవుడ్, టాలీవుడ్ సినీప్రముఖులు రియాక్ట్ అవుతున్నారు. ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి ఈ ఘటనపై స్పందించగా.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ లీలావతి ఆసుపత్రికి చేరుకున్నట్లు సమాచారం.

ఈ ఘటన తర్వాత సైఫ్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. సైఫ్ టీమిండియా మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడి.. హిందీ నటి షర్మిలా టాగోర్ దంపతుల కుమారుడు. 1991లో హిందీ నటి అమృతా సింగ్ ను వివాహాం చేసుకున్నారు.

వీరికి సారా అలీఖాన్, ఇబ్రహీం అలీఖాన్ జన్మించారు. ఆ తర్వాత 2004లో వీరిద్దరు విడాకులు తీసుకోగా.. 2012లో హీరోయిన్ కరీనా కపూర్ ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. నివేదికల ప్రకారం సైఫ్ ఇప్పటివరకు రూ.1,180 కోట్లు సంపాదించారు.

సైఫ్ పూర్వీకులు పటౌడీ నవాబులు. వారికి హర్యానాలో పటౌడీ ప్యాలెస్ ఉంది. 10 ఎకరాల్లో 150 గదులు, ఏడు పడగ గదులతో విశాలంగా ఉంది. దాని ధర రూ.800 కోట్లు. ముంబై, ఢిల్లీ, హర్యానా, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో మొత్తం ఏకంగా రూ.5000 కోట్లకు అధిపతి.