
షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినిమాల్లోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు. అలా వచ్చిన వారిలో చాందిని చౌదరి ఒకరు. హీరోయిన్ గా ఆచి తూచి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా చేయకముందు పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది.

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం సినిమాల్లో చిన్న రోల్స్ చేసింది. ఆ తర్వాత కుందనపుబొమ్మ సినిమాతో హీరోయిన్ గా మారింది. అలాగే కలర్ ఫోటో సినిమాతో పేక్షకులను మెప్పించింది. కలర్ ఫోటో సినిమాలో చాందిని చౌదరి తన నటనతో ఆకట్టుకుంది.

ఈ సినిమా తర్వాత చాందిని వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఆమధ్య విష్వక్ సేన్ గామీ తో పాటుగా లేటెస్ట్ గా వచ్చిన యేవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రాలతో ఆకట్టుకుంది. కానీ ఈ ముద్దుగుమ్మకు సాలిడ్ హిట్ మాత్రం దక్కలేదు.

ఇక నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. అలాగే ఇటీవలే విడుదలైన సంతాన ప్రాప్తిరస్తు అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమాలేవీ ఈ ముద్దుగుమ్మకు అనుకుంత గుర్తింపు తీసుకురావడంలేదు.

ఇక సోషల్ మీడియాలో మాత్రం ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే తాజాగా చాందిని షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.