
ప్రముఖ హీరోయిన్ ప్రణిత సుభాష్ , నితిన్ రాజు దంపతులకు గత ఏడాది సెప్టెంబర్‌లో మగబిడ్డ పుట్టాడు. ఈ బుడ్డోడికి తాజాగా నామకరణ మహోత్సవం నిర్వహించారు.

ప్రణీత కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో పాటు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

ప్రముఖ నటి రమ్య, పుష్ప ఫేమ్ డాలి ధనంజయ్ తదితర సెలబ్రిటీలు ప్రణీత కుమారుడి బారసాల వేడుకలో తళుక్కుమన్నారు.

ప్రస్తుతం ఈ బారసాల వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి.

ఈ సందర్భంగా ప్రణీత- నితిన్ రాజు దంపతులు తమ కుమారుడికి జయ కృష్ణ అని నామకరణం పెట్టారు

కాగా కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రణిత, వ్యాపారవేత్త నితిన్ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2022లో ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమెకు అర్నా అని పేరు పెట్టారు.