AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు తిరుగులేని హీరోయిన్.. ఆమె ఎవరంటే

సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన అరుదైన ఫొటోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ల చిన్ననాటి చిత్రాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తమ అభిమాన తారలు చిన్నప్పుడు ఎలా ఉండేవారో తెలుసుకోవాలనే ఆసక్తి ఫ్యాన్స్‌లో ఎక్కువగా ఉంటుంది .

Rajeev Rayala
|

Updated on: Oct 15, 2026 | 7:44 PM

Share
సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన అరుదైన ఫొటోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ల చిన్ననాటి చిత్రాలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటాయి. తమ అభిమాన తారలు చిన్నప్పుడు ఎలా ఉండేవారో తెలుసుకోవాలనే ఆసక్తి ఫ్యాన్స్‌లో ఎక్కువగా ఉంటుంది. అందుకే తారల బాల్య ఫొటోలు బయటకు వచ్చినప్పుడల్లా వాటిని తెగ షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు. ఇప్పుడు అలాంటి ఓ అందమైన చిన్నారి ఫొటో గురించి తెలుసుకుందాం.

1 / 5
పై ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్న ఈ పాప ఇప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే ఈమెకు సినిమాలతో పరిచయం కొత్తేమీ కాదు. హీరోయిన్‌గా మారకముందే బాలనటిగా వెండితెరపై సందడి చేసింది. చిన్న వయసులోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తోంది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?

2 / 5
ఆమె మరెవరో కాదు.. అందాల తార కీర్తి సురేష్. తన సహజమైన నటనతో తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ.. బాలనటిగా కూడా పలు చిత్రాల్లో నటించింది. కీర్తి చిన్ననాటి ఫొటోల్లో కనిపిస్తున్న క్యూట్‌నెస్ ఇప్పటికీ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది. కీర్తి సురేష్‌కు సినీ నేపథ్యం ఉంది. ఆమె ప్రముఖ నిర్మాత జి. సురేష్ కుమార్, నటి మేనక దంపతుల కుమార్తె. చిన్న వయసులోనే సినిమాల్లో నటించడం ప్రారంభించిన కీర్తి.. మలయాళ చిత్రాల్లో బాలనటిగా కనిపించింది.

3 / 5
అందులో 'కుబేరన్' సినిమా కూడా ఒకటి. బాలనటిగా తెరపై కనిపించిన ఈమె.. ఆ తర్వాత హీరోయిన్‌గా తన ప్రయాణాన్ని కొనసాగించింది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా మలయాళం, తమిళ చిత్రాలతో తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లింది. 2015లో వచ్చిన తమిళ చిత్రం 'ఇదు ఎన్న మాయం'తో హీరోయిన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ఏడాది విడుదలైన 'నేను శైలజ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. రామ్ సరసన నటించిన ఈ చిత్రంలో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి ఆదరణ పొందడంతో టాలీవుడ్‌లోనూ కీర్తికి గుర్తింపు పెరిగింది. 

4 / 5
ఆ తర్వాత వరుసగా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ తన నటనలోని మరో కోణాన్ని చూపించింది. ముఖ్యంగా 'మహానటి' చిత్రంలో సావిత్రి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని కూడా అందుకుంది. తెలుగు, తమిళం, మలయాళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కీర్తి సురేష్.. హిందీ చిత్ర పరిశ్రమలోనూ అడుగుపెట్టింది. భాష ఏదైనా తన పాత్రకు ప్రాధాన్యం ఉండేలా కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. గ్లామర్ పాత్రలతోనే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతోనూ ప్రేక్షకులను మెప్పించగలనని నిరూపించింది.

5 / 5
Follow Us