
చదువుకునే రోజుల్లో చాలా మంది హీరోయిన్స్ డాక్టర్స్, ఇంజనీర్ కావాలని కలలు కన్నవాళ్ళే. కానీ అనుహ్యంగా సినీరంగంలోకి అడుగుపెట్టి నటీనటులుగా సక్సెస్ అయిన తారలు ఉన్నారు. పైన ఫోటోలో కనిపిస్తున్న టాలీవుడ్ హీరోయిన్ సైతం ఆ కోవకే చెందుతుంది. రేసింగ్ లో శిక్షణ తీసుకుంది. కట్ చేస్తే సినిమాల్లో క్రేజీ హీరోయిన్ గా మారింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

ఈ బ్యూటీ మరెవరో కాదండి.. హీరోయిన్ నివేతా పేతురాజ్. తమిళనాడులోని మధురైలో పుట్టి పెరిగిన ఈ అమ్మడు.. పదేళ్లు దుబాయిలో ఉన్న చదువులు చదివింది. ఆ తర్వాత మిస్ ఇండియా యూఏఈ పోటీల్లో విజేతగా నిలిచింది. మిస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లోనూ పాల్గొంది. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.

మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఆ త్రవాత టిక్ టిక్ టిక్, చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అలవైకుంఠపురంలో, రెడ్ ,పాగల్, దాస్ కా దమ్కీ సినిమాల్లో నటించి నటిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమిళ భాషలోనూ అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది.

కేవలం నటిగానే కాకుండా కారు రేసింగ్ పోటీల్లో పాల్గొంటుంది నివేద. అలాగే బ్యాడ్మింటన్ పోటీల్లోనూ పాల్గొంటూ విజేతగా నిలుస్తుంటుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను నివేద తన ఇన్ స్టాలో షేర్ చేస్తుంటుంది. ఈ ముద్దుగుమ్మ మల్టీ ట్యాలెంట్ అంటూ ప్రశంసలు కురిపిస్తుంటారు నెటిజన్స్.

సినిమాలతోపాటు పలు వెబ్ సిరీస్ సైతం చేసింది నివేదా. చివరకు ఆమె పరువు అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఇది జీ5లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం నివేదా చేతిలో ఏ సినిమా లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ ఈ అమ్మడు. తాజాగా ఈ ముద్దుగుమ్మ క్రేజీ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.