
పైన ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? ఒకప్పుడు సీరియల్స్ ద్వారా టీవీరంగంలో చక్రం తిప్పింది. హీరోయిన్లకు మించి క్రేజ్ సొంతం చేసుకుంది. సీరియల్స్ లో హీరో తల్లిగా కనిపించిన ఆమె... ఇప్పుడు మాత్రం వెండితెరపై అలరించేందుకు రెడీ అయ్యింది.

ఆమె మరెవరో కాదండి..జగతి మేడమ్.. అదేనండి.. గుప్పెడంత మనసు సీరియల్ నటి అలియాస్ జ్యోతిరాయ్. ఈసీరియల్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇందులో ఆమె యాక్టింగ్, లుక్ జనాలను తెగ ఆకట్టుకున్నాయి.

చాలా కాలంపాటు గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన జ్యోతిరాయ్.. ఆ తర్వాత సీరియల్స్ కు గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడు ఓటీటీలో పలు వెబ్ సిరీస్, సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ఇప్పుడు కిల్లర్ అనే సినిమాలో నటిస్తుంది.

అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టి్వ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంటుంది. ఒకప్పుడు చీరకట్టులో కనిపించిన జ్యోతిరాయ్.. ఇప్పుడు మాత్రం మోడ్రన్ డ్రెస్సులలో అందంతో కట్టిపడేస్తుంది. గ్లామర్ లుక్స్ లో నెట్టింట హీటెక్కిస్తుంది ఈ వయ్యారి.

ప్రస్తుతం కిల్లర్ సినిమాలో నటిస్తుంది జ్యోతిరాయ్. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంలో జ్యోతిరాయ్.. విభిన్న పాత్రలో కనిపించనుంది. ఇదివరకు విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. త్వరలోనే ఈ సినిమా అడియన్స్ ముందుకు రానుంది.