
సౌత్ ఇండస్ట్రీలోనే మోస్ట్ క్రేజీ హీరోయిన్ ఆమె. టీనేజ్ లోనే సినీరంగంలోకి అడుగుపెట్టి మొదటి సినిమాతోనే అందరి చూపు తనవైపు తిప్పుకుంది. మలయాళంలో వరుస సినిమాల్లో మెప్పించిన ఈ అమ్మడు..ఎక్కువగా తెలుగులోనే సినిమాలు చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

తనే హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. మొన్నటివరకు హోమ్లీ బ్యూటీగా కనిపించిన ఈ కేరళ కుట్టి.. ఇప్పుడు మాత్రం గ్లామరస్ ఫోటోలతో చంపేస్తుంది. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ.. ఆ తర్వాత శతమానం భవతి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది.

అయితే తెలుగులో ఎక్కువగా ట్రెడిషనల్ లుక్స్.. హోమ్లీగా కనిపించిన అనుపమ.. టిల్లు స్వ్కైర్ సినిమాలో మాత్రం బీభత్సమైన గ్లామర్ లుక్స్ లో కనిపించి అభిమానులకు షాకిచ్చింది. అందులో లిల్లీ పాత్రలో కాస్త బోల్డ్ గా.. నెగిటివ్ రోల్ పోషించింది. ఎప్పటిలాగే అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ప్రస్తుతం ఆమె జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అనే చిత్రంలో నటిస్తుంది. కానీ కెరీర్ తొలినాళ్లల్లో తనకు యాక్టింగ్ రాదని ట్రోల్ చేశారని.. ఆ సమయంలో ఎంతో బాధపడ్డానని తెలిపింది. వ్యక్తిగత జీవితంలో కెరీర్ పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్లు తెలిపింది. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపింది.

అనుపమ పరమేశ్వరన్ నటించిన జానికి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమా జూన్ 27న విడుదల కానుంది. ఇందులో జానకి పాత్రలో కనిపించనుంది. మరోవైపు సోషల్ మీడియాలో అనుపమ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. సౌత్ ఇండస్ట్రీలో ఈ అమ్మడుకు విపరీతమైన క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కుర్రాళ్ల ఆరాధ్య దేవత ఈ అమ్మడు.