
చాలా మంది నటీమణులు ఒకే సినిమాలో అవకాశం కోసం ఇబ్బంది పడుతుంటే, ఒక హీరోయిన్ మాత్రం ఒకే సంవత్సరంలో ఏడు సినిమాల్లో నటించి రికార్డు సృష్టించింది. మొదట్లో అవకాశాలు తక్కువగా ఉన్న ఆమె ఇప్పుడు హిట్లతో దూసుకుపోతుంది. ఆమె ఎవరో తెలుసా.. ?

ఆమె మరెవరో కాదు అనుపమ పరమేశ్వరన్. "ప్రేమమ్" సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో తనదైన ముద్ర వేశారు. కేరళలోని త్రిసూర్ కు చెందిన అనుపమ, 19 సంవత్సరాల వయసులో 2015లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

"ప్రేమమ్" చిత్రంలో మేరీ పాత్ర చిన్నదే అయినప్పటీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రం ఆమెకు కొత్త అవకాశాలను అందించింది. ఆమె ధనుష్ సరసన "కోడి" చిత్రంలో నటించింది. అలాగే తెలుగులో అఆ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో వరుస సినిమాల్లో నటించి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది మాత్రమే అనుపమ ఏడు చిత్రాల్లో నటించింది. వీటిలో తమిళ చిత్రాలు "డ్రాగన్" , "బైసన్" మంచి హిట్టయ్యాయి. మలయాళంలో "ది పెట్ డిటెక్టివ్" ,"జానకి" చిత్రాల్లో నటించింది.

తెలుగులో "కిష్కేంద్రపురి","పరదా" వంటి ఆరు చిత్రాలు విడుదలయ్యాయి. ఈ సంవత్సరం నటించిన ఏడవ చిత్రం "లాక్‌డౌన్" డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ ఏడాది చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది అనుపమ.