
బాలీవుడ్ స్టార్ బ్యూటీ ఆలియా భట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా తక్కువ సమయంలో ఈ అమ్మడు ఊహించని విధంగా మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది. తన అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది.

స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది వరస సినిమాలో దూసుకెళ్తుంది. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటుతుంది. వరసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటుంది. బాలీవుడ్‌లోనే కాకుండా, టాలీవుడ్ కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

రాజ మౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో ఈ ముద్దుగుమ్మ సీత పాత్రలో మెరిసింది. అచ్చం పల్లెటూరి అమ్మాయిలా , తన ప్రేమ కోసం తపించే ప్రియురాలిగా, ఈ బ్యూటీ ఆ సినిమాలో తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. ఈ మూవీతో ఈ ముద్దుగుమ్మకు చాలా పాపులారిటీ వచ్చింది.

అయితే తెలుగులో పాన్ ఇండియా సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా ఈ చిన్నదానికి అంతగా అదృష్టం కలిసి రాలేదనే చెప్పాలి. ఈ మూవీ చేసిన తర్వాత చాలా మంది ఈ బ్యూటీ వరసగా అవకాశాలు వస్తాయి అనుకున్నారు. కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌లో వరసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తుంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ రీసెంట్‌గా జరిగినా బీఏఎఫ్టీఏ అవార్డ్స్ ఈవెంట్‌లో రెడ్ కార్పెట్ పై మెరిసింది. ఈ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దానికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.