
అతి పెద్ద తెలుగు రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్పటివరకు 5 సీజన్స్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.. మొదటి సీజన్ నుంచి చివరిగా వచ్చిన సీజన్ 5 వరకు మంచి టీఆర్పీ తో దూసుకుపోయింది ఈ గేమ్ షో.. ఇక ఇప్పుడు నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయడానికి ఓటీటీ వేదికగా రాబోతుంది. అయితే ఈ నాన్ స్టాప్ ఎంటర్టైనమెంట్ లో ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెస్టెంట్స్ లిస్ట్ లో వీరు కూడా ఉన్నారు..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన నగ్నం సినిమాతో పరిచయం అయ్యింది శ్రీ రాపాక. మొదటి సినిమాతోనే బోల్ బ్యూటీగా పేరుతెచ్చుకుంది ఈ చిన్నది

బిగ్ బాస్ సీజన్ 4 లో తన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అఖిల్ మరోసారి ఈ బిగ్ బాస్ ఓటీటీలో అలరించనున్నాడు

అఖిల్ తోపాటు అందాల భామ అరియన కూడా మరోసారి సందడి చేయడానికి బిగ్ బాస్ ఓటీటీలో అడుగుపెట్టనుంది.

వీరితోపాటు కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ కూడా ఈసారి బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు

అందం అభినయంతో కుర్రకారును కట్టిపడేసిన తేజేస్వి మదివాడ ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలో అడుగు పెట్టనుంది.

మహేష్ విట్టా తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మహేష్ విత్తా కూడా బిగ్ బాస్ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు

వీరితోపాటు అందాల భామ అశు రెడ్డి కూడా మరోసారి బిగ్ బాస్ ఓటీటీ ద్వారా అలరించడానికి రెడీ అవుతుంది.

అలాగే గత సీజన్ లో ఆకట్టుకున్న హమీద కూడా ఈసారి ఎంట్రీ ఇవ్వనుంది

మెహబూబ్ దిల్ సే బిగ్ బాస్ ఓటీటీ ద్వారా మరో సారి సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.

తన మాటలతో, నటన తో ఆకట్టుకున్న 7 ఆర్ట్స్ సరయు కూడా బిగ్ బాస్ ఓటీటీలో అడుగుపెట్టనుంది

తన మాటలతో శ్రోతలను ఆకట్టుకునే ఆర్ జె చైతు కూడా ఈసారి బిగ్ బాస్ ఓటీటీలోకి అడుగు పెట్టనున్నాడు.