- Telugu News Photo Gallery Cinema photos Anukreethy Vas latest fabulous looks goes viral in social media
Anukreethy Vas: ఈ కుమారి కౌగిట నలిగిన ఆ చీరది ఏనాటి పుణ్యమో.. ఫ్యాబులస్ అనుక్రీతి..
2023లో తెలుగు తెరకు పరిచయం అయిన అందాల ముద్దుగుమ్మ అనుక్రీతి వాస్. తన వయ్యారాలతో తెలుగు ప్రేక్షకులకు చెమటలు పట్టించింది. తాజాగా ఈ కోమలి సోషల్ మీడియా వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఈ ఫోటోలను చుసిన కుర్రకారు క్రేజీ కామెంట్స్ పెడుతూ షేర్ చేస్తున్నారు. ఇక మీరు కూడా ఈ ట్రెండీ ఫోటోలపై ఓ లుక్కెయ్యండి.
Updated on: Apr 25, 2025 | 4:40 PM

28 సెప్టెంబర్ 1998న తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ అనుక్రీతి వాస్. ఈ బ్యూటీ ఏడు సంవత్సరాల వయస్సులో తన తల్లిదండ్రలు విడిపోయారు. కేరళకు చెందిన ఆమె తల్లి సెలీనా వద్ద పెరిగింది.

తిరుచిరాపల్లిలోని మాంట్‌ఫోర్ట్ స్కూల్‌లో చదివింది. సీనియర్ సెకండరీ విద్యను R. S. కృష్ణన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో పూర్తి చేసింది. ప్రస్తుతం తమిళనాడు రాజధాని చెన్నైలోని లయోలా కాలేజీలో ఫ్రెంచ్ సాహిత్యంలో BA డిగ్రీని అభ్యసిస్తుంది ఈ భామ.

మిస్ వరల్డ్ 2017 మానుషి చిల్లర్ చేతలమీదగా ఫెమినా మిస్ ఇండియా 2018 కిరీటాన్ని కైవసం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. 8 డిసెంబర్ 2018న చైనాలోని సన్యాలో జరిగిన మిస్ వరల్డ్ 2018 పోటీలో అనుక్రీతి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.

2022లో కోలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ DSPతో విజయ్ సేతుపతికి సరసన కథానాయకిగా చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ భామ. 2023లో రవితేజ హీరోగా చేసిన టైగర్ నాగేశ్వరరావులో జయవాణి అనే ఓ వేశ్య పాత్రతో తెలుగులో తొలిసారి నటించింది.

తాజాగా ఈ కోమలి సోషల్ మీడియా వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. ఈ ఫోటోలను చుసిన కుర్రకారు క్రేజీ కామెంట్స్ పెడుతూ షేర్ చేస్తున్నారు. ఇక మీరు కూడా ఈ ట్రెండీ ఫోటోలపై ఓ లుక్కెయ్యండి.




