Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తీసుకునే ఫుడ్ ఇదే.. అందుకే అంత ఫిట్‌గా ఉన్నారు : ఆనంద్ సాయి

Updated on: Sep 19, 2026 | 1:52 PM

ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆహారపు అలవాట్లు, ఆయన జీవనశైలిపై పలు ఆసక్తికర విషయాలను పవన్ కళ్యాణ్ మిత్రుడు  ఆనంద్ సాయి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. పవన్ కళ్యాణ్ జీవితంలో సాధారణత్వం, ఆరోగ్యానికి ఆయన ఇచ్చే ప్రాధాన్యత గురించి వివరంగా తెలిపారు

1 / 5
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆహారపు అలవాట్లు, ఆయన జీవనశైలిపై పలు ఆసక్తికర విషయాలను పవన్ కళ్యాణ్ మిత్రుడు  ఆనంద్ సాయి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. పవన్ కళ్యాణ్ జీవితంలో సాధారణత్వం, ఆరోగ్యానికి ఆయన ఇచ్చే ప్రాధాన్యత గురించి వివరంగా తెలిపారు ఆనంద్ సాయి. ఆనంద్ సాయి మాటల ప్రకారం, పవన్ కళ్యాణ్ ఆహారం విషయంలో చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయన ఉదయం అల్పాహారం చాలా తక్కువగా తీసుకుంటారు. 

2 / 5
కొన్నిసార్లు అసలు తీసుకోరని తెలిపారు. ఉదయం పూట యోగా, వ్యాయామం వంటి శారీరక శ్రమకు ఆయన అధిక ప్రాధాన్యత ఇస్తారు. మధ్యాహ్న భోజనానికి వచ్చేసరికి, పవన్ కళ్యాణ్ ఎక్కువగా పెరుగు అన్నం తినడానికి ఇష్టపడతారు. దీనికి కారణం, హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల పనితీరు మందగించి, ముఖ్యమైన మీటింగ్‌లకు హాజరు కాలేమని ఆయన భావించడమే. మాంసాహారం విషయంలో కూడా ఆయన అదే తీరును అవలంబిస్తారు.

3 / 5
చాలా తక్కువగా నాన్-వెజ్ తింటారని, కొన్నిసార్లు కేవలం గ్రేవీని మాత్రమే తీసుకుంటారని ఆనంద్ సాయి వివరించారు. రుచి కంటే ఆకలి తీరడం, శరీరానికి అవసరమైన శక్తి లభించడం ఆయన ప్రధాన ఉద్దేశ్యం. ఈ భోజన విధానం కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా, ఆయన మానసిక స్థితికి కూడా అద్దం పడుతుంది. జీవితం పట్ల ఆయనకున్న ఫిలాసఫీని కూడా ఆనంద్ సాయి పంచుకున్నారు.

4 / 5
"మనిషి అర్థం కోసం అన్వేషణ" (A Mans Search for Meaning) వంటి పుస్తకాలను ఆయన చదువుతారని, నొప్పి ఎదురైనప్పుడే మనిషి బలంగా మారుతాడు అనే సిద్ధాంతాన్ని ఆయన నమ్ముతారని తెలిపారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలనేది ఆయన ఆలోచన.మనిషికి తన అంతర్గత స్వరమే ఉత్తమ సలహాదారు అని, ఏది మంచో, ఏది చెడో మన మనసు మనకు చెబుతుందని ఆనంద్ సాయి పేర్కొన్నారు.

5 / 5
అధికంగా తినడం, తక్కువగా తినడం వంటి విషయాల్లో కూడా మన శరీరం మనకు సంకేతాలు ఇస్తుందని ఆయన అన్నారు. ఈ అంతర్గత జ్ఞానాన్ని విని, దానిని అనుసరించడమే నిజమైన ఆరోగ్యమని పవన్ కళ్యాణ్ భావిస్తారని. డబ్బు, హోదా ఎంత ఉన్నా, మనిషి ప్రాథమిక అవసరాలు మారవు అనే సత్యాన్ని కూడా పవన్ కళ్యాణ్ మాటల ద్వారా ఆనంద్ సాయి వివరించారు. బంగారం తినలేము, సాధారణ ఆహారమే మనిషికి అవసరం. బయట ఎన్ని రకాల రుచికరమైన ఆహారాలు ఉన్నా, ఇంటి భోజనం, ముఖ్యంగా అమ్మ చేతి వంటకు ఉండే తృప్తి, రుచి వేరే దేనికీ ఉండదని ఆయన అన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us