ఎయిర్‌ పోర్టులో ప్రముఖ మోడల్‌ అరెస్ట్‌..! గంజాయి తరలిస్తూ అడ్డంగా బుక్కైన బ్యూటీ..

|

Jul 19, 2023 | 11:03 AM

ప్రముఖ అమెరికన్ సూపర్ మోడల్ జిగి హదీద్‌ (28)ను ఎయిర్ పోర్టు అధికారులు అరెస్టు చేశారు. యూకేలోని ఓవెన్ రాబర్ట్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రైవేట్ విమానంలో స్నేహితురాలితో కలిసి కేమాన్ దీవులకు వెళ్లే క్రమంలో అరెస్టు..

1 / 5
ప్రముఖ అమెరికన్ సూపర్ మోడల్ జిగి హదీద్‌ (28)ను ఎయిర్ పోర్టు అధికారులు అరెస్టు చేశారు. యూకేలోని ఓవెన్ రాబర్ట్స్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రైవేట్ విమానంలో స్నేహితురాలితో కలిసి కేమాన్ దీవులకు వెళ్లే క్రమంలో అరెస్టు చేసినట్లు తెలిపారు.

2 / 5
మోడల్‌ హదీద్, ఆమె ఫ్రెండ్‌ జూలై 10న ఓ ప్రైవేట్ జెట్‌లో ఎయిర్‌ పోర్టుకి చేరుకున్నారు. ఎయిర్‌ పోర్ట్‌ కస్టమ్ అధికారులు వారి లగేజీని చెక్‌ చేయగా గంజాయి, గంజాయి వినియోగానికి ఉపయోగించే పరకరాలు (smoking utensils) కనిపించాయి. ఇద్దరి లగేజీలో ఇవి లభ్యమయ్యాయి.

3 / 5
మత్తు పదార్ధాలు కలిగివున్నందున మోడల్‌ హదీద్, ఆమె స్నేహితురాలిని కస్టమ్‌ అధికారులు అరెస్ట్‌ చేసి ఖైదీ డిటెన్షన్ సెంటర్‌కు తీసుకెళ్లారు.

4 / 5
ఐతే అక్కడ బెయిల్‌పై ఇద్దరు మహిళలు విడుదలైనట్లు సమాచారం. వీరు తరలిస్తున్న గంజాయి వ్యక్తిగత వినియోగానికి మాత్రమే తీసుకెళ్తున్నట్లు తెలిసింది.

5 / 5
జూలై 12న వీరిద్దరినీ కోర్టులో హాజరుపరచగా వారు నేరాన్ని అంగీకరించారు. ఒక్కొక్కరికి వెయ్యి డాలర్ల చొప్పున కోర్టు జరిమానా విధించింది. అందిన సమాచారం మేరకు వీరిపై ఎటువంటి నేరారోపణ కేసు నమోదు కాలేదు.