అల్లు అర్జున్ సినిమాకు.. ప్రభాస్‌కు.. లింక్.. అదేంటో ఈ స్టోరీలో చూసేయండి

Edited By: Phani CH

Updated on: Jun 27, 2025 | 9:45 PM

అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమాకు ప్రభాస్‌కు ఓ లింక్ ఉంది తెలుసా..? అదేంటి ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి అనుకుంటున్నారు కదా..? అలాంటిదేం లేదు.. కానీ అంతకంటే తక్కువ న్యూస్ అయితే కాదు. బన్నీ చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్‌తో ప్రభాస్‌కు గట్టి రిలేషన్ ఉంది. అదేంటో ఈ స్టోరీలో చూసేద్దామా..?

1 / 5
పుష్ప 2 తర్వాత తన ప్లానింగ్‌తో నిజంగానే ఇరగదీస్తున్నారు అల్లు అర్జున్. దర్శకుల విషయంలో చాలా అంటే చాలా క్లారిటీగా ఉన్నారు. మొన్నటి వరకు త్రివిక్రమ్ అనుకున్నా.. సడన్‌గా అట్లీని సీన్‌లోకి తీసుకొచ్చారు బన్నీ.

2 / 5
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది. దీని తర్వాత ఏం చేయాలనే దానిపై ఇప్పట్నుంచే కసరత్తులు మొదలయ్యాయి. అట్లీ సినిమాని ఎంత వేగంగా పూర్తి చేసినా.. ఏడాదైతే పడుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ అంతా పూర్తి చేసి అది విడుదల చేయడానికి.. ఇప్పట్నుంచి కనీసం రెండేళ్లు పడుతుంది.

3 / 5
ఆలోపు తన ప్లానింగ్ తాను చేసుకుంటున్నారు అల్లు అర్జున్. ఈయన తర్వాతి ప్రాజెక్ట్ కోసం ఇద్దరు ముగ్గురు దర్శకులు లైన్‌లో ఉన్నారు.. అందులో అందరికంటే రేసులో ప్రశాంత్ నీల్ ముందున్నారు.

4 / 5

ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా డ్రాగన్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్ నాటికి పూర్తి కానుంది. జూన్ 25, 2026న విడుదల కానుంది ఈ చిత్రం. దీని తర్వాత ప్రభాస్‌తో కమిట్‌మెంట్ ఉంది ప్రశాంత్ నీల్‌కు..! నిజానికి సలార్ 2 కాకుండా దిల్ రాజు, ప్రభాస్ కాంబోలో మరో సినిమా కూడా ప్రశాంత్ నీల్ చేయాల్సి ఉంది.

5 / 5
దిల్ రాజు, ప్రశాంత్ నీల్ కాంబోలో చేయాల్సిన ప్రాజెక్ట్ ప్రభాస్ నుంచి బన్నీ చేతుల్లోకి వచ్చినట్లు తెలుస్తుంది. అన్నీ కుదిర్తే అట్లీ తర్వాత బన్నీ చేయబోయే సినిమా ప్రశాంత్ నీల్‌తోనే..! ఈ మధ్య ఇంటర్వ్యూల్లో కూడా 2026 మధ్యలో ఓ పెద్ద సినిమా మొదలుపెడతామంటూ హింటిచ్చారు దిల్ రాజు. అల్లు అర్జున్ సినిమా తర్వాతే.. సలార్ 2 వెళ్లేలా ఉన్నారు ప్రశాంత్ నీల్.