సోమవారం (జనవరి 22) అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట అట్టహాసంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగిన ఈ మహా క్రతువుకు దేశంలోని వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. అందులో అలియా భట్-రణ్‌బీర్ దంపతులు కూడా ఉన్నారు.
అయితే అయోధ్యకు వచ్చిన అలియా కంటే ఆమె ధరించిన చీరనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక సింపుల్ బ్లూ కలర్ శారీలో ఈ వేడుకకు వచ్చింది అలియా. అయితే చీర బోర్డర్ పైమాత్రం రామాయణాన్ని కళ్లకు కట్టే పలు చిత్రాలు, అక్షరాలు ఉన్నాయి.
అలియా తన భర్త రణ్‌బీర్ కపూర్‌తో కలిసి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరైంది. ఓ ప్రత్యేక విమానంలో అయోధ్యకు చేరుకున్నారీ లవ్లీ కపుల్. అనంతరం అక్కడి అభిమానులతో ఎంతో ఓపికగా ఫొటోలు దిగాలు అలియా- రణ్‌బీర్
వీటితో పాటు అలియా చీర కొంగుపై రామసేతు బ్రిడ్జి, హనుమాన్ చిత్రాలు కూడా ఉన్నట్లు అక్కడికొచ్చిన అతిథులు గుర్తించారు. ప్రస్తుతం అలియా చీర ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఫ్యాషన్‌లో తనకంటూ ఓ ట్రెండ్ క్రియేట్ చేసుకున్న అలియా భట్ ఇలా సందర్భానికి తగ్గట్టుగా ఎంతో సంప్రదాయంగా అయోధ్య వేడుకకు రావడం అందరినీ ఆకట్టుకుంది.