Anil kumar poka | Edited By: Team Veegam
Aug 26, 2022 | 5:40 PM
పెళ్లి ముందే కలిసుంటే తప్పేంటి అంటున్నారు బాలీవుడ్ క్యూటీ అలియా భట్. రీసెంట్‌గా రణబీర్ కపూర్‌ను పెళ్లాడిన ఈ భామ...
పెళ్లికి ముందు నుంచే మేం ఒకే ఇంట్లో ఉంటున్నాం అన్న విషయాన్ని కన్ఫార్మ్ చేశారు. తమ పెళ్లి ప్లానింగ్ ఎలా జరిగిందన్న విషయాన్ని కూడా రివీల్ చేశారు.
దాదాపు ఐదేళ్ల ప్రేమాయణం తరువాత అలియా - రణబీర్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. 2019లోనే పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశారు. కానీ కోవిడ్ కారణంగా ఆ ప్లానింగ్ అంతా డిస్టర్బ్ అయ్యింది.
అయితే పెళ్లి వాయిదా పడినా.. కలిసుండాలన్న నిర్ణయాన్ని మాత్రం వాయిదా వేయలేదు అలియా - రణబీర్.కరోనా కారణంగా వెడ్డింగ్ ఫార్మాలిటీస్ ఆలస్యమైనా ముందు అనుకున్న టైమ్‌కే కలిసుండటం స్టార్ట్ చేశారు.
దాదాపు ఏడాదిన్నర పాటు లివిన్‌లో ఉన్న ఈ జంట ఆ తరువాత గ్రాండ్‌గా పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా రివీల్ చేశారు క్యూట్ బ్యూటీ అలియా భట్.
పెళ్లికి ముందే కలిసుండటం గురించి స్పందించిన అలియా భట్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. 'అందులో తప్పేముంది.
ముందు నుంచి కలిసుండటం వల్ల ఒకరినొకరు అర్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎన్నో మంచి మెమొరీస్ కూడా క్రియేట్ అవుతాయంటూ' లివిన్ రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు.
తాజాగా బేబీ బంప్ తో కనిపించిన అలియా న్యూ ఫొటోస్..