
అక్షయ తృతీయ రోజు ఏది కొన్నా అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా చాలా మేలు చేస్తుందని చెబుతుంటారు. అందుకే కొంత మంది బంగారం లేదా వెండి కొనుగోలు చేస్తే మరి కొంత మంది మాత్రం వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటారు. అయితే ఈ రోజు ఎలాంటి రంగు ఉన్న వాహనం కొనుగోలు చేయడం మంచిదో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

అక్షయ తృతీయ రోజు వామనం కొనుగోలు చేయడం చాలా మంచిది. అయితే ఈరోజు కొన్ని రకాల రంగులు కలిగిన వాహనం కొనుగోలు చేయడం వలన మరింత అదృష్టం కలిసి వస్తుందంట. కాగా, ఇంతకీ ఈ రోజున ఎలాంటి రంగుల ఉన్న వాహనం కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం.

వైశాఖ మాసం శుక్లపక్షం మూడవ రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమై, ఏప్రిల్ 20 సోమవారం రోజున ఉదయం 10.39 నిమిషాలకు ముగుస్తుంది. అందువలన ఏప్రిల్ 19నే అక్షయ తృతీయ పండుగను ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. అయితే ఈరోజు ఏ రాశి వారు ఏ రంగు వాహనం కొనుగోలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.

మేష రాశి, ఎరుపు, మెరును, వృషభ రాశి వారు తెలుపు, మిథున రాశి వారు ఆకుపచ్చ, కర్కాటక రాశి వారు తెలుపు లేదా క్రీమ్, సింహ రాశి వారు చాక్లెట్, మెరూన్, కన్యా రాశి వారు బూడిద రంగు, ఆకుపచ్చ, వృశ్చిక రాశి వారు ముదురు ఎరుపు రంగు, ధనస్సు రాశి వారు క్రీమ్, పసుపు, మకర రాశి వారు నీలం, గోధుమ, కుంభ రాశి వారు నీలం, నలుపు రంగులో ఉన్న వాహనాలు కొనుగోలు చేయడం వలన అదృష్టం కలిసి వస్తుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు