
ఏప్రిల్ 8న 27వ పుట్టిన రోజును జరుపుకుంటున్న అఖిల్.. ఈ సందర్భంగా ఆయన కొత్త సినిమా 'ఏజెంట్' మూవీని పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. ఈ కార్యక్రమానికి నాగార్జున, అమల ముఖ్యఅతిధులుగా పాల్గొన్నారు.

ఈ సినిమాను ఏ.కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సురేందర్ సినిమా సంయుక్త సమర్పణలో అనిల్ సుంకర నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'సైరా నరసింహ రెడ్డి' సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.


మునుపెన్నడూ చూడని విభిన్నమైన కథ, యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ఇందులో అఖిల్ సీక్రెట్ ఏజెంట్గా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

ఫస్ట్ లుక్తోపాటే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. ఈ మూవీని డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్లుగా తెలిపింది.

ప్రస్తుతం అఖిల్.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాను చేస్తున్నాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. జూన్ 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

అక్కినేని అఖిల్..