
సౌత్ ఇండస్ట్రీలో త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాదాపు 2 దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. అందుకు కారణం విజయ్, సంగీత విడాకులు తీసుకోవడమే.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నుంచి విడాకులు కావాలంటూ ఆయన భార్య సంగీత చెంగల్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. తన భర్తకు మరో నటితో ఎఫైర్ ఉందంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆ నటి త్రిష అంటూ నెట్టింట ప్రచారం జోరందుకుంది.

ఈ క్రమంలోనే త్రిష గురించి.. ఆమె పర్సనల్ లైఫ్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్. 1999లో జోడి సినిమాతో తమిళ సినీరంగంలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2004లో ప్రభాస్ సరసన వర్షం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ త్రిష కెరీర్ ను మలుపు తిప్పింది.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో వరుస హిట్స్ అందుకుంది. ఇప్పటికీ నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో మెప్పిస్తుంది. ప్రస్తుతం త్రిష ఒక్కో సినిమాకు రూ.3 కోట్లకు పైగా తీసుకుంటుందట. అలాగే విజయ్ జోడిగా నటించిన లియో చిత్రానికి రూ.5 కోట్లు తీసుకుందని సమాచారం.

నివేదికల ప్రకారం త్రిష ఆస్తులు రూ.130 కోట్ల వరకు ఉందని టాక్. ఆమెకు హైదరాబాద్, చెన్నై ప్రాంతాల్లో సొంతంగా ఇల్లు ఉన్నాయి. అలాగే ఆమె వద్ద ప్రీమియం కార్ కలెక్షన్ ఉంది. వాటి ధర రూ.63 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఉంటుందని సమాచారం.