
కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాలతో పాన్ ఇండియా ఫేమస్ అయిపోయింది కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి. ఇందులో ఆమె అందం, అభినయానికి కుర్రకారు ఫిదా అయిపోయారు.

అయితే వీటి తర్వాత శ్రీనిధి నటించిన సినిమా కోబ్రా పెద్దగా ఆడలేదు. విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా జస్ట్ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

అయితే న్యాచురల్ స్టార్ నానితో కలిసి శ్రీనిధి శెట్టి నటించిన హిట్ 3 బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

దీని తర్యాత స్టార్ బాయ్ సిద్దూ జొన్నలగడ్డతో కలిసి తెలుసు కదా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది శ్రీనిధి శెట్టి.అయితే ఈ సినిమా కేవలం యావరేజ్ గా మాత్రమే ఆడింది.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విక్టరీ వెంకటేష్ నటిస్తోన్న ఆదర్శ కుటుంబం అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు

సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే శ్రీనిధి శెట్టి లేటెస్ట్ గా కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేసింది. ఇందులో చీర కట్టుతో మేకప్ లేకుండా సింపుల్ లుక్ తో కట్టి పడేసిందీ అందాల తార.