Rajeev Rayala |
Apr 15, 2022 | 9:06 PM
శ్రుతి హాసన్ కెరీర్ మళ్లీ ట్రాక్ మీదకి వచ్చిన సంగతి తెలిసిందే.'క్రాక్' సక్సెస్ తో అమ్మడు ఫుల్ స్వింగ్ లోకి వచ్చేసింది.
బ్యాక్ టు బ్యాక్ ఛాన్సులందుకుంటూ దూసుకుపోతుంది శ్రుతి
ఇటీవలే 'వకీల్ సాబ్' తోనూ మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం శ్రుతి లైన్ అప్ చూస్తే సీనియర్ స్టార్ హీరోలతోనే ఎక్కువ
ప్రస్తుతం ప్రభాస్ సరసన పాన్ ఇండియా చిత్రం 'సలార్' లో నటిస్తోంది.
శ్రుతి కెరీర్ లో ఇదే తొలి పాన్ ఇండియా కేటగిరీ చిత్రం కావడం విశేషం.
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో శ్రుతినే హీరోయిన్ గా ఎంపికైంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి 154వ ప్రాజెక్ట్ లో నటిస్తుంది.
సోషల్ మీడియాలో అమ్మడి యాక్టివిటీ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. అప్పుడప్పుడు హాట్ ఫోటోలతో ఇన్ స్టాని హీటెక్కిస్తుంది. ప్రియుడితో కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోల్ని షేర్ చేస్తుంటుంది. అభిమానులతో ఆసక్తికర చర్చకు సిద్దమవుతుంటుంది.