
టాలీవుడ్ ఇండస్ట్రీలో గోల్డెన్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది హీరోయిన్ సంయుక్త మీనన్. తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రాలన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.

బింబిసార, సార్, విరూపాక్ష చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళం, మలయాళ భాషలలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.

వరుసగా విజయాలను అందుకుంటూ తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీకి మాత్రం మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.

ఆఫర్స్ రాలేదా ? లేదా అవకాశాలను వదిలేసుకుంటుందా ? అనేది మాత్రం తెలియరాలేదు. చివరిసారిగా నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ చిత్రంలో కనిపించింది.

ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. కానీ మలయాళంలో వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంటుంది సంయుక్త.

తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటో నెట్టింట వైరలవుతుంది. బ్లాక్ టాప్ వైట్ ప్యాంటు లో యూత్ ని బాగా అట్ట్రాక్ట్ చేస్తుంది ఈ సొగసరి.