
అదృష్టం అంటే ఈ అమ్మాయిదే కాబోలు. మొదటి సినిమాలో చిన్న రోల్. అంతగా ప్రాధాన్యత.. స్క్రీన్ స్పేస్ లేని పాత్ర. అయినా సరే నటించి తెలుగు తెరకు పరిచయమైంది.

కానీ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అదే భీమ్లా నాయక్. ఆ సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.

ఈ చిత్రంలో క్లైమాక్స్ లో రానాని కాపాడుకునే క్రమంలో ఆమె యాక్టింగ్ కు ఫిదా అయిపోయారు అంతా.. అమ్మాయి బాగుంది.. నటనతో మెప్పిస్తోంది. ఇంకేముంది వరుస అవకాశాల క్యూ కట్టాయి.

ఆ తర్వాత కళ్యాణ్ రామ్ జోడిగా బింబిసార చిత్రంలో నటించింది. ఈ మూవీ కూడా హిట్ కావడంతో తెలుగులో అమ్మాడి పేరు మారుమోగింది.

ఆతర్వాత తమిళ్ స్టార్ ధనుష్ సరసన సార్ చిత్రంలో నటించింది. ఈ మూవీ సైతం భారీ విజయాన్ని అందుకుంది. వరుస హిట్లతో దూసుకపోతున్న ఈ భామా ఖాతాలో తాజాగా విరూపాక్ష చేరింది.

కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించారు. ఇందులో సంయుక్త కథానాయికగా నటించగా.. కాస్త గ్లామర్ డోస్ పెంచింది.

గత సినిమాల్లో హోమ్లీగా కనిపించినా ఈ అమ్మడు.. ఇందులో కాస్త డోస్ పెంచి అలరించింది. దీంతో చాలా సినిమాలకు హీరోయిన్ దొరికేసిందన్న భావన దర్శకనిర్మాతల్లో కలుగుతుంది.

వరుస హిట్లతో గోల్డెన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సంయుక్త. ఇక బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది.