Rajeev Rayala |
Jan 27, 2022 | 12:58 PM
సమయం దొరికినప్పుల్లా సామ్ విహార యాత్రలకు వెళ్తుంటుంది. చైతూతో విడాకుల తర్వాత తొలిసారి ఆమె తన స్నేహితురాలితో కలిసి బద్రీనాథ్ తీర్థయాత్రలకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే
తాజాగా ఆమె స్విట్జర్లాండ్ టూర్ లో ఉంది. అక్కడ తెల్లటి మంచు అందాలను ఆస్వాదిస్తోంది.
ఆ మంచులో సాహసక్రీడల్లో పాల్గొంటోంది. స్కీయింగ్ చేస్తూ ఉల్లాసంగా కాలాన్ని గడుపుతోంది.
మాతృత్వం గురించి సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఓ వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'ఆడవాళ్లు చాలా చాలా స్ట్రాంగ్. ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది మోస్ట్ పెయిన్ ఫుల్ ప్రొసీజర్. కేవలం తల్లి మాత్రమే అలాంటి అత్యంత బాధాకరమైన ప్రక్రియను అనుభవించి కూడా బిడ్డని చూడగానే నవ్వగలుగుతుంది'' అని సమంత ఈ ఇంటర్వ్యూలో తెలిపింది.
ఇప్పటికే 'శాకుంతలం' 'కాతు వాకుల రెండు కాదల్' వంటి రెండు సినిమాలను పూర్తి చేసిన సామ్.. ప్రస్తుతం 'యశోద' అనే పాన్ ఇండియా మూవీ షూటింగ్ లో పాల్గొంటోంది.