
టాలీవుడ్.. కోలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సమంత సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది.


హీరోయిన్ గా అవకాశాలు రాకముందు పెద్ద పెద్ద ఫంక్షన్స్ కు హాజరు అయ్యే గెస్ట్ లకు వెల్ కమ్ చెప్పే అమ్మాయిగా వెళ్ళేదట.. రోజుకు 500 ఇచ్చేవారట


తల్లిదండ్రుల కోరిక మేరకు నేను చదివి టాపర్ గా నిలిచే దాన్ని. కాని డబ్బులు లేని సమయంలో డిగ్రీలో జాయిన్ అవ్వలేక చదువు ను వదిలేశాను అంటూ సమంత చెప్పుకొచ్చింది.

మోడలింగ్ వైపు వెళ్తున్న సమయంలో మొదట్లో కొందరు తనను కొందరు విమర్శించారు. కుటుంబంలో కొందరు అవసరమా అనే వారట

నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను ముందడుగు వేశాను అని తెలిపింది సామ్. ఇక ఇప్పుడు సౌత్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో మొదటి వరసలో ఉంది సమంత.. అటు బాలీవుడ్ లోనూ ఆఫర్లు అందుకుంటుంది సమంత.