
గతేడాది అమరన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది హీరోయిన్ సాయి పల్లవి. డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివకార్తికేయన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తెలుగులో తండేల్ చిత్రంలో నటిస్తుంది.

తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన సాయి పల్లవి.. జార్జియాలో వైద్య విద్యను పూర్తి చేసింది. ఆ తర్వాత ప్రేమమ్ సినిమాతో మలయాళీ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది.

సాయి పల్లవి వెండితెరపైకి రాకముందు బుల్లితెరపై ఎన్నో డ్యాన్స్ పోటీల్లో పాల్గొంది. ప్రేమమ్ సినిమా హిట్ తర్వాత మలయాళంలో పలు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత 2018లో కరు సినిమాతో కోలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టింది.

ఫిదా సినిమాతో తెలుగు సినీపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన తండేల్ చిత్రంలో నటిస్తుంది.

ఇదిలా ఉంటే.. సాయి పల్లవి న్యూ జర్నీ చేయబోతుందనే టాక్ నడుస్తుంది. త్వరలోనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తుందట. ఆ సినిమాను తెలుగులోనూ రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.