Rajitha Chanti |
Jun 07, 2022 | 1:26 PM
అందం, అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది రాశీ ఖన్నా. అతి తక్కువ సమయంలోనే సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.
తెలుగు, తమిళంతో పాటు హిందీలో ఏక కాలంలో సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం చేతిలో ఏకంగా ఆరు సినిమాలు ఉన్న ఈ చిన్నది తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ టాలెంటెడ్ హీరో శర్వానంద్ సరసన నటించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ‘ఒకే ఒక జీవితం’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన శర్వానంద్, త్వరలోనే కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు.
వీరిద్దరి కలయికలో రాబోతున్న సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాలో శర్వానంద్‌కు జోడిగా రాశీ ఖన్నా నటించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే చిత్ర యూనిట్ రాశీ ఖన్నను సంప్రదించగా, ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
ఈ నెలలో సినిమా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి, వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. ఇక ఈ సినిమాలో సరికొత్తగా కనిపించేందుకు శర్వా ప్రస్తుతం బరువు తగ్గే పనిలో ఉన్నారని టాక్ నడుస్తోంది.
మరి ఈ కొత్త జోడి నిజంగానే సిల్వర్ స్క్రీన్‌పై కనిపిస్తారా.? లేదా అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
లక్కీ ఛాన్స్ పట్టేసిన రాశి ఖన్నా.. శర్వానంద్ సరసన ముద్దుగుమ్మ ?..