మోడల్‌గా కెరియర్ స్టార్ట్ చేసి, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నభానటేష్.. అనతి కాలంలోనే ఎంతో క్రేజ్ సంపాదించుకుంది.
1995 డిసెంబర్ 11 లో శ్రీంగేరిలో జన్మించిన ఈ బామ.. మంగుళూరులో ఇన్ఫర్మేషన్ సైన్స్ లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసింది.
ఆ తరువాత మోడల్‌గా మారి ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు 2013 లో టాప్ 10 లో నిలిచింది నభా.
కన్నడ సినీ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ‘వజ్రకాయ’(2015)తో నభ నటేష్ అరంగేట్రం చేసింది.
వజ్రకాయలో శివ రాజ్‌కుమార్ సరసన నటించి, తన నటనతో, అందచందాలతో ఔరా అనిపించింది.
2018లో ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు చలనచిత్రంపై తళుక్కుమంది.
ఆ తరువాత ‘అదుగో’ సినిమా చేసిన పెద్దగా గుర్తింపు దక్కలేదు.
2019లో పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో, హీరో రామ్ కథనాయకుడిగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కథానాయికగా నటించి మెప్పించింది. ఈ సినిమా నభా కెరియర్‌కు బూస్ట్ ఇచ్చింది.
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా తరువాత డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాల్లోనూ నటించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం మరికొన్ని అప్‌కమింగ్ సినిమాల్లో నటిస్తోంది.