షార్ట్ ఫిలిమ్స్ నుంచి సినీ ప్రయాణం మొదలుపెట్టి కలర్ ఫోటో సినిమాతో కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది తెలుగమ్మాయి చాందిని చౌదరి. ఇటీవలే విశ్వక్ సేన్ నటించిన గామి సినిమాలో కనిపించింది. ఇందులో చాందిని నటనకు ప్రశంసలు వచ్చాయి. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేశారు. వైవిధ్యమైన కథతో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికే ఈ మూవీ రూ. 25 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో చాందిని లైఫ్ రిస్క్ పెట్టి మరీ నటించింది.