Rajitha Chanti |
Jan 15, 2023 | 9:08 PM
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు అనుపమ పరమేశ్వరన్. మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ఆడియన్స్ మనసు దొచుకుంది.
త్రివిక్రమ్ తెరకెక్కించిన అఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత శతమానం భవతి సినిమాతో అలరించింది.
ఈ మూవీ తర్వాత తెలుగులో వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.
గతేడాది రెండు వరుస హిట్స్ అందుకుంది అనుపమ. ముఖ్యంగా కార్తికేయ 2 చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది.
తాజాగా అనుపమ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
సంక్రాంతి పండగ సందర్భంగా ఎరుపు రంగు లెహాంగాలో బాపు గీసిన బొమ్మలా కనిపిస్తోంది.
ఉంగరాల ముంగురులు.. చంద్రబింబం వంటి మోము.. నయనాలకు నళ్లని కాటుకతో కట్టిపడేస్తుంది.
ఈ ఫోటోలను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. ఇటీవల బటర్ ఫ్లై సినిమాతో ఓటీటీలో అలరించింది ఈ కేరళ కుట్టి.
రవివర్మ ఊహకే అందని రూపం తన సొంతం.. భూవిపైకి దిగివచ్చిన వెండి వెన్నెలమ్మ..