
పాన్ ఇండియా హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ అదితి రావు హైదరీ. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించిన అదితి.. హీరామండి వెబ్ సిరీస్ ద్వారా నటిగా మరిన్ని మంచి మార్కులు కొట్టేసింది.

హీరామండి విజయం తర్వాత గతేడాది కేన్స్ రెడ్ కార్పెట్ పై సందడి చేసింది అదితి రావు హైదరీ. ఇక ఇప్పుడు కూడా మరోసారి రెడ్ కార్పెట్ పై సొగసైన లుక్స్ లో కనిపించి అభిమానులను ఖుషీ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఎర్రటి చీరకట్టులో.. నుదుటన సింధూరం ధరించి వివాహం తర్వాత మొదటిసారి కేన్స్ రెడ్ కార్పెట్ పై నడిచింది అదితి. నీలిరంగు అంచు ఉన్న శాటిన్ సిల్క్ చీరలో అదితి లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.

కేన్స్‌లో ఆమె సొగసైన లుక్స్ అభిమానులను కట్టిపడేశాయి. నిన్న జరిగిన హోమ్‌బౌండ్ ప్రీమియర్‌ను చూడటానికి రాహుల్ మిశ్రా రూపొందించిన కస్టమైజ్డ్ దుస్తుల్లో అదితి రెడ్ కార్పెట్‌పైకి వచ్చింది.

ప్రస్తుతం అదితి షేర్ చేసిన ఈ స్టన్నింగ్ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే.. కొన్ని నెలల క్రితం కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ ను అదితి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్నారు.