Aamani : ఆ ఒక్కటి అస్సలు తినను.. ఉదయం నుంచి రాత్రి వరకు డైట్ ప్లాన్ ఇదే.. ఆమని..

Updated on: May 30, 2026 | 8:05 PM

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన తారలలో ఆమని ఒకరు. అప్పట్లో గ్లామర్ షోకు దూరంగా చీరకట్టులో కనిపిస్తూనే అగ్ర కథానాయికగా సత్తా చాటింది. ఫ్యామిలీ చిత్రాలతోపాటు వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పుడు బుల్లితెరపై సీరియల్స్, ఇటు సినిమాల్లో సహయ నటిగా రాణిస్తుంది.

1 / 5
ప్రముఖ నటి ఆమని ఇటీవల తన ఆరోగ్య రహస్యాలు, వృత్తిపరమైన క్రమశిక్షణ, వ్యక్తిగత జీవితం, రాబోయే నారి చిత్రం గురించి వివరంగా మాట్లాడారు. దర్శకుడు ఈవివి సత్యనారాయణ తన కెరీర్ ప్రారంభంలోనే నటన ఒక్కటే కాకుండా, ఒక నటికి ఉండాల్సిన లక్షణాలు, క్రమశిక్షణ, స్కిన్ కేర్, సరైన నిద్ర ప్రాముఖ్యతను నేర్పించారని ఆమె గుర్తు చేసుకున్నారు. ప్రొడక్షన్ నుండి ఏమీ ఆశించకుండా, తనకంటూ ఒక స్థాయి వచ్చిన తర్వాత అన్నీ వాటంతట అవే లభిస్తాయని ఈవివి సత్యనారాయణ చెప్పిన పాఠం తన జీవితంలో చాలా కీలకమని ఆమని పేర్కొన్నారు.

2 / 5
ఆరోగ్యం, ఆహార అలవాట్ల గురించి మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచే తనకు ఆరోగ్య క్రమశిక్షణ అలవడిందని తెలిపారు. తాను సన్నగా ఉన్నప్పటికీ అన్ని రకాల ఆహారాన్ని తక్కువ పరిమాణంలో తీసుకుంటానని వివరించారు. తాను నాన్-వెజిటేరియన్ కానప్పటికీ, ఇంట్లో అందరి కోసం నాన్-వెజ్ వంటలు (బిర్యానీ వంటివి) బాగా వండుతానని చెప్పారు. ఆమె జీవితంలో దైవభక్తికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి రోజూ ఉదయం 4 గంటలకు నిద్రలేచి స్నానం చేసి, లలితా సహస్రనామం లేదా విష్ణు సహస్రనామం పఠిస్తూ పూజ చేస్తానని, దీపం పెట్టకుండా ఇంటి నుండి బయటికి వెళ్లనని తెలిపారు.

3 / 5
మానసిక ప్రశాంతత కోసం పూజ ఎంత అవసరమో, శారీరక ఆరోగ్యం కోసం యోగా, వ్యాయామం కూడా అంతే అవసరమని ఆమె నమ్ముతారు. పబ్బులు, పార్టీల వంటి వాటికి దూరంగా ఉండి, కుటుంబంతో, పనితో సంతోషంగా గడుపుతానని ఆమె వివరించారు. తాను డైటింగ్ పేరిట ఆహారాన్ని పూర్తిగా మానేయనని స్పష్టం చేశారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్.. ఇలా మూడు పూటలా తిన్నప్పటికీ, కేవలం 'పోర్షన్ కంట్రోల్' పాటించడమే తన ఫిట్‌నెస్‌కు ప్రధాన కారణమని ఆమె వివరించారు.

4 / 5
ఆమని పుట్టి పెరిగిన కుటుంబ నేపథ్యం వల్ల ఆమెకు చిన్నప్పటి నుంచే పూర్తి శాకాహార అలవాట్లు వచ్చాయి. ఆమె విశ్వబ్రాహ్మిణ్ కుటుంబానికి చెందినవారు కావడం, అలాగే వారి అమ్మ  కూడా నాన్-వెజ్ తినకపోవడంతో ఆమనికి చిన్నతనం నుంచే మాంసాహారం అంటే ఇష్టం ఉండేది కాదు. ఇంట్లో పిల్లల కోసం ఆమె స్వయంగా ఎంతో రుచికరమైన నాన్-వెజ్ వంటలు , బిర్యానీలు వండినప్పటికీ, ఆమె మాత్రం వీటికి పూర్తిగా దూరంగా ఉంటారు. ఈ పూర్తి శాకాహార శైలి ఆమె జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతగానో తోడ్పడుతోంది.

5 / 5
ఆమని తన కెరీర్ ప్రారంభంలోనే ఇండస్ట్రీలోని పెద్దల నుండి క్రమశిక్షణ, సరైన విశ్రాంతి ప్రాముఖ్యతను నేర్చుకున్నారు. రాత్రి త్వరగా పడుకుని, ఉదయాన్నే త్వరగా లేవడం వల్ల ముఖంలో సహజమైన గ్లో ఎప్పటికీ అలాగే ఉంటుందని ఆమె నమ్ముతారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'మిస్టర్ పెళ్ళాం', 'శుభ సంకల్పం' వంటి ఎన్నో అద్భుతమైన చిత్రాల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చెరపలేని ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం బుల్లితెరపై, వెండితెరపై సందడి చేస్తున్నారు.

Follow Us