6 నెలలు.. అరడజను సినిమాలు.. ఒక్కొక్కటి.. ఒక్కో బ్లక్ బస్టర్

Edited By: Phani CH

Updated on: Jun 27, 2025 | 10:05 PM

ఉందిలే మంచికాలం ముందుముందునా.. అంటూ పాడుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇన్నాళ్లూ ఈగలు తోలుకుంటున్న థియేటర్లకు ఇకపై కళ రాబోతుంది. ఆర్నెళ్లకో సినిమా అయినా వస్తుందా అనే రోజుల నుంచి.. ఇక మీద నెలకో పెద్ద సినిమా రానుంది. ఒకేసారి 1500 కోట్ల బిజినెస్ కళ్ల ముందు కనిపిస్తుంది. మరి అందులో వెనక్కి వచ్చేదెంత.. నిర్మాతలకు మిగిలేదెంత...? చూద్దాం ఎక్స్‌క్లూజివ్‌గా..

1 / 5
సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఆ స్థాయి బ్లాక్‌బస్టర్ ఆర్నెళ్లుగా ఇండస్ట్రీ చూడలేదు. మధ్యలో కొన్ని విజయాలు వచ్చినా.. అవి బ్లాక్‌బస్టర్స్ కాదు. ఇక స్టార్స్ అయితే పూర్తిగా మొహం చాటేసారు. ఇలాంటి సమయంలో జులై నుంచి అసలైన సినీ పండగ మొదలు కానుంది.

2 / 5
డిసెంబర్ వరకు వరసగా నెలకో ప్యాన్ ఇండియన్ సినిమా థియేటర్లలో దర్శనమివ్వబోతుంది. జులై 4న తమ్ముడు సినిమాతో ఈ పండగ షురూ కానుంది. అదే నెల 11న అనుష్క ఘాటీ విడుదల కానుంది.. క్రిష్ ఈ సినిమాను అన్ని భాషల్లో రూపొందిస్తున్నారు.

3 / 5
అలాగే జులై 24న హరిహర వీరమల్లు విడుదల కానుంది. ఈ సినిమా కోసమే ఎగ్జిబిటర్లు కూడా వేచి చూస్తున్నారు.. ఇంచుమించూ అదే టైమ్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ రిలీజ్ డేట్ లాక్ అయ్యేలా కనిపిస్తుంది.

4 / 5
ఆగస్ట్ 14న వార్ 2 విడుదల కానుంది. ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి దీనిపై భారీ అంచనాలున్నాయి. ఇక వినాయక చవితి కానుకగా ఆగస్ట్ 27న రవితేజ మాస్ జాతర విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే సెప్టెంబర్‌తో పాటు దసరా సీజన్ అంతా ఓజి, అఖండ 2తో పవన్, బాలయ్య దండయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ రెండూ సెప్టెంబర్ 25నే విడుదల కానున్నాయి.

5 / 5
అక్టోబర్, నవంబర్‌లలో ఇప్పటికైతే సినిమాలేం షెడ్యూల్ కాలేదు కానీ విశ్వంభర, సంబరాల ఏటిగట్టు లాంటి ప్యాన్ ఇండియన్ సినిమాల డేట్స్ ఇంకా లాక్ అవ్వలేదు.. కాబట్టి ఆ టైమ్‌లో వచ్చినా రావచ్చు. అలాగే డిసెంబర్ 5న రాజా సాబ్ రానున్నాడు.. మొన్నటి టీజర్‌తో అంచనాలు పెరిగిపోయాయి. అలాగే క్రిస్మస్‌కు అడివి శేష్ డెకాయిట్ విడుదల కానుంది. ఇలా రానున్న ఆర్నెళ్లు హౌజ్ ఫుల్ అయిపోయింది.