
చిత్తూరుజిల్లా ఐరాల మండలంలో అద్భుతం ఘటన వెలుగు చూసింది. ఓ శివాలయంలో శివలింగానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన పూజారికి ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన నూనెతో ఆభిషేకం చేస్తుంటే.. ఆ నూనె శివలింగంపై పడగానే.. పాలలా మారి శివయ్యను అభిషేకిస్తుందని జిల్లా వ్యాప్తంగా తెగ ప్రచారం సాగింది.

దాదాపు 800 ఏళ్ల క్రితం నాటి మృత్యుంజయ శివాలయంలో జరుగుతున్న ఈ అద్భుతం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతుంది. దీంతో అద్భుతం మహా అద్భుతమంటూ జనం క్యూ కట్టడం స్టార్ట్ చేశారు. దీంతో ఐరాల మండలం చిన్న వెంకటాపల్లిలో మృత్యుంజయ శివాలయం భక్తులతో నిండిపోతోంది.

గత మే నెలలో ఆలయ పునర్నిర్మానం చేపట్టిన స్థానికులు కుంబాభిషేకం నిర్వహించారు. గత 10 రోజులు గా శివాలయంలో రుద్ర పఠనం కూడా జరుగుతుంది. ఈ నేపధ్యం లోనే ఆలయ అర్చకుడు రాజేష్ స్వామి శివలింగానికి నువ్వుల నూనె తో అభిషేకం చేస్తుండగా పాలుగా మారుతున్న వైనం ఆశ్చర్యానికి గురి చేసింది.

అద్భుత ఘటనగా భావించి ఆ నోట ఈ నోట అందరికీ తెలిసిపోయింది. దీంతో చుట్టుపక్కల గ్రామస్తుల తో పాటు స్థానికులు చూసేందుకు తరలి వస్తుండడంతో భక్తజనం పోటెత్తుతుంది. నూనె శివలింగంపై పోయగానే తెల్లగా పాలవలే ఎలా మారుతుందో తెలియక ఆశ్చర్యానికి గురవుతున్న భక్తులు అంతా శివలీలలేనంటూ భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు.

అద్భుతమంటూ ఆశ్చర్యానికి గురి అవుతూనే ఆధ్యాత్మిక చింతనతో మైమరిచిపోతున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన చాలా మంది తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఇది ఏదైనా రసాయన చర్యవల్ల జరిగి ఉటుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఘటన ఇప్పుడు నెట్టింట తెగవైరల్‌గా మారింది.