
Chia Seeds

బరువు తగ్గడానికి చియా సీడ్స్ స్మూతీ: బరువు తగ్గడానికి చియా విత్తనాలను స్మూతీస్‌లో ఉపయోగించవచ్చు. దీని కోసం మీకు ఇష్టమైన పండ్లు, పెరుగును వేసి కలపాలి. తర్వాత ఒక చెంచా నానబెట్టిన చియా గింజలను వేసి అన్ని మిక్స్ చేయండి. దీన్ని అల్పాహారంగా తీసుకోవచ్చు.

సలాడ్‌లో చియా విత్తనాలను ఉపయోగించండి : బరువు తగ్గడానికి, చియా గింజలను సలాడ్‌లో కలిపి తినవచ్చు. ఇది మీ కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీని కోసం, మీరు సలాడ్లో 1-2 స్పూన్ల చియా విత్తనాలను తినవచ్చు. కావాలనుకుంటే నిమ్మరసం, నల్ల మిరియాలు కూడా చల్లుకోవచ్చు.

బరువు తగ్గడానికి చియా సీడ్స్ పుడ్డింగ్: బరువు తగ్గడానికి చియా సీడ్స్ పుడ్డింగ్ ఒక ఆరోగ్యకరమైన ఎంపిక. దీన్ని సిద్ధం చేయడానికి, ఒక టేబుల్ స్పూన్ చియా గింజలను రాత్రంతా పాలలో నానబెట్టండి. ఇందులో పండ్లు, డ్రై ఫ్రూట్స్, నట్స్ వేసి ఉదయాన్నే తీసుకుంటే తినడానికి రుచికరంగా ఉంటుంది మరియు బరువు కూడా తగ్గుతుంది.

ఓట్స్, చియా విత్తనాలు: మీరు అల్పాహారంగా ఓట్స్ తింటే, మీరు చియా విత్తనాలను కూడా అందులో కలుపుకోవచ్చు. ఓట్స్‌లో చియా గింజలను వేసుకోవటం వల్ల మీ అల్పాహారం మరింత పోషకమైనదిగా మారుతుంది. ఇది శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.