
నేటి కార్పొరేట్ ప్రపంచంలో ఉద్యోగ ఒత్తిడి కారణంగా చాలామంది ఒకరికొకరు టైం ఇచ్చుకోలేక ఫ్యామిలీ ప్లానింగ్‌ను వాయిదా వేస్తున్నారు. ఇది మహిళలు, పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి , అనారోగ్యకరమైన జీవనశైలి, ఆలస్యంగా పిల్లలను ప్లాన్ చేసుకోవడం వల్ల గర్భం దాల్చడంలో సమస్యలు ఎదురవుతున్నాయని.. ఈ సమస్య అదిగమించేందుకు మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం.

ఉద్యోగ ఒత్తిడి ఎలా ప్రభావం చూపుతుంది?: రోజంతా ఒకే చోట కూర్చుని పని చేయడం వల్ల శరీర కదలికలు తగ్గుతాయి. దీనివల్ల పెల్విక్ ఏరియాలో రక్త ప్రసరణ తగ్గి, సంతానోత్పత్తి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అలాగే రాత్రి ఆలస్యంగా మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్లను చూడటం వల్ల నిద్ర పాడవుతుంది. ఇది శరీరంలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది, ఇది ఫర్టిలిటీకి ఎంతో నష్టం చేస్తుంది.

ప్రమాదాన్ని పెంచే ఇతర అలవాట్లు ఏమిటి?: ఒత్తిడి మాత్రమే కాదు.. మర రోజువారిలో చాలా అవాట్లు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. వాటిలో కాఫీ ఎక్కువగా తాగడం, నిరంతర ఒత్తిడి, 30 ఏళ్ల తర్వాత గర్భధారణకు ప్రణాళిక వేయడం, హానికరమైన రసాయనాలకు గురికావడం వంటివి కూడా సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక ఒత్తిడి తరచుగా మహిళల్లో అండ విడుదల ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుందని.. దీనివల్ల కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుందని.. ఈ అలవాట్లన్ని ప్రమాదాన్ని మిరింత పెంచుతాయని అంటున్నారు .

ప్రత్యుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏమి చేయాలి? :సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడానికి, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి మీకు కొన్ని అలవాట్లను అలవార్చుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా రోజూ కొద్దిసేపు శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగవుతుంది. అలాగే పోషకాలు అధికంగా ఉండే సమతుల్య ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలి. రోజుకు కనీసం 7 నుండి 8 గంటల ప్రశాంతమైన నిద్ర పోవాలి అప్పుడే బాడీ రిలాక్స్ ఉంటుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

దానితో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం లేదా నచ్చిన హాబీలపై దృష్టి పెట్టడం వంటి చేయాలి. అంతేకాకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆలోచన ఉంటే, ఆలస్యం చేయకుండా సరైన సమయంలో వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి.. కెమికల్స్ లేదా హానికరమైన వాతావరణంలో పనిచేసే వారు తగిన రక్షణ పరికరాలను ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఈ అలవాట్లు మనలో ఒత్తిడిని తగ్గించి బాడీని ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉంచడానికి దోహదపడుతాయని చెబుతున్నారు.