దాదాపుగా 2022 సంవత్సరాంతానికి చేరుకున్నాము. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా చాలా మంది అంతర్జాతీయ క్రికెటర్లు అద్భుత ప్రదర్శన చేయగా, వారిలో కొందరు సిక్సుల మీద సిక్సులతో చెలరేగిపోయారు. అలా 2022 సంవత్సరంలో అత్యధికంగా క్రికెట్ మైదానం నుంచి బయటకు వెళ్లేలా బంతిని బాదిన టాప్ 5 ఆటగాళ్లు ఎవరో చూద్దాం..
సూర్యకుమార్ యాదవ్: 2022 సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా టీమిండియా బ్యాట్స్‌మ్యాన్ సూర్యకుమార్ యాదవ్ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది మొత్తం 44 మ్యాచ్‌లు ఆడిన సూర్య 74 సిక్సర్లు బాది 2022 సిక్సర్ కింగ్‌గా నిలిచాడు.
నికోలస్ పూరన్: 2022 సంవత్సరంలో 44 ఇన్నింగ్స్ ఆడిన వెస్టిండీస్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ మొత్తం 59 సిక్సర్లు బాదాడు. దీంతో ఈ ఏడాది అత్యధికంగా సిక్సర్స్ కొట్టిన ప్లేయర్ల జాబితాలో పూరన్ 2వ స్థానంలో ఉన్నాడు.
మహ్మద్ వసీం: ఈ ఏడాది అత్యధికంగా సిక్సర్లు కొట్టిన క్రికెటర్ల జాబితాలో యూఏఈ టీమ్ ఆటగాడు మహ్మద్ వాసిమ్ కూడా ఉన్నాడు. 2022 సంవత్సరంలో 37 మ్యాచ్‌లు ఆడిన వసీం 58 సిక్సర్లు కొట్టి లిస్టులో మూడో స్థానంలో ఉన్నాడు.
సికందర్ రాజా: సిక్సర్ కింగ్స్ జాబితాలో జింబాబ్వే ఆటగాడు సికందర్ రాజా కూడా ఉన్నాడు. 2022లో 39 ఇన్నింగ్స్‌లు ఆడిన సికందర్ మొత్తం 55 సిక్సర్లు కొట్టి ఈ జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు.
అయితే స్వదేశంలో వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత సిక్సర్ కింగ్ ఎవరో చూద్దాం..