కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా.? మీ బడ్జెట్ తక్కువైనా లేదా ఎక్కువైనా పర్వాలేదు, ఎన్నో రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ రూ. 10 లక్షల కంటే తక్కువ ధర ఉన్న కారును కొనుగోలు చేయాలనుకుంటే.. టయోటా గ్లాంజా, హ్యుందాయ్ ఆరా నుంచి మహీంద్రా థార్ లాంటి వాహనాలు బెస్ట్ ఆప్షన్స్. ఈ కార్లు రూ. 10 లక్షల కంటే తక్కువ(ఎక్స్-షోరూమ్) ధరలో లభిస్తాయి. ఇంకో ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇంత బడ్జెట్‌లో మీరు ఎలక్ట్రిక్ కారును కూడా కొనుగోలు చేయవచ్చు. మరి ఆ లిస్టు ఏంటో తెలుసుకుందామా.?
ప్రముఖ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా.. ఇటీవల ప్రముఖ ఆఫ్-రోడ్ SUV థార్‌కు సంబంధించిన చౌకైన మోడల్‌ను విడుదల చేసింది. ఈ విలాసవంతమైన SUVని రూ. 10 లక్షల బడ్జెట్‌లో కొనుగోలు చేయవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 1497 సీసీ డీజిల్ ఇంజిన్‌తో వస్తోంది. అలాగే ఈ కారు లీటర్ డీజిల్‌కు 15 కిలీమీటర్ల మైలేజ్ అందిస్తోంది.
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUV కార్లలో టాటా నెక్సాన్ ఒకటి. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.7.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీనికి1199 cc పెట్రోల్ ఇంజిన్ అమర్చబడింది. అదే సమయంలో, ఈ కారు లీటరుకు 17.57 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇందులో మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ కూడా ఉంది.
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కారుల్లో ఒకటైన టయోటా గ్లాంజా కూడా రూ.10 లక్షల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.59 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర మాత్రం రూ. 9.99 లక్షలు. ఇందులో 1197 సిసి ఇంజిన్ ఉంది. అదే సమయంలో, ఈ కారు పెట్రోల్‌తో పాటు, CNGతో కూడా నడుస్తుంది. ఇది 22-31 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
మీరు ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయాలనుకుంటే, టాటా టియాగో EV మంచి ఆప్షన్. టాటా ఎలక్ట్రిక్ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.49 లక్షలు మాత్రమే. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఈ కారు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.
హ్యుందాయ్ ఆరా.. ఇది దక్షిణ కొరియా ఆటో కంపెనీ హ్యుందాయ్‌కి చెందిన విలాసవంతమైన సెడాన్ కారు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.6.20 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అదే సమయంలో, దీని టాప్ మోడల్ రూ.8.97 లక్షల ఎక్స్-షోరూమ్ ధరకు అందుబాటులో ఉంది. ఇది పెట్రోల్, CNG ఎంపికలలో లభిస్తుంది. ఈ కారు లీటర్‌కు 20-28 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది.