చలికాలంలో ఎండు చేపలు తింటున్నారా..? అయితే, ఇది తెలుసుకోండి..

Updated on: Nov 26, 2026 | 3:12 PM

చలికాలంలో ఎండు చేపలు తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ప్రొటీన్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చలి వాతావరణంలో శరీరానికి అవసరమైన శక్తిని, వెచ్చదనాన్ని అందిస్తాయి. ఎముకలను దృఢంగా మార్చి, కీళ్ల నొప్పులను తగ్గించడంలోనూ సహాయపడతాయి. దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉన్నవారికి కూడా ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. అయితే, చలికాలంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఎండు చేపలకు బూజు పట్టే ప్రమాదం ఉంటుంది. అందువల్ల వాటి శుభ్రతను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. చెడు వాసన రాకుండా, తాజాగా ఉన్నప్పుడు మాత్రమే వీటిని తినడం మంచిది.

1 / 5
చాలామందికి ఎండు చేపలు అంటే ఎంతో ఇష్టం. సీజన్‌తో సంబంధం లేకుండా వీటిని తినడానికి ఆసక్తి చూపుతుంటారు. ముఖ్యంగా చలికాలంలో చాలామంది ఎండు చేపలను తమ ఆహారంలో చేర్చుకుంటారు. మరి చలి వాతావరణంలో ఎండు చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఆరోగ్య నిపుణుల ప్రకారం, సరైన జాగ్రత్తలు పాటిస్తూ తింటే ఇవి చలికాలంలో శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి.

2 / 5
ఆరోగ్య ప్రయోజనాలు: ఎండు చేపలలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.ఎండు చేపలలో ప్రొటీన్, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. ఇవి చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని, తగినంత శక్తిని అందిస్తాయి.

3 / 5
కాల్షియం వంటి పోషకాల వల్ల ఎముకలు గట్టిపడతాయి. అలాగే కీళ్ల నొప్పులు తగ్గడానికి కూడా ఇవి తోడ్పడతాయి. చలికాలంలో దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా ఎండు చేపలు మంచి ఎంపికగా నిపుణులు పేర్కొంటున్నారు.

4 / 5
తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు: చలికాలంలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, నిల్వ,శుభ్రత విషయంలో అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. చలికాలంలో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ తేమ కారణంగా ఎండు చేపలపై త్వరగా బూజు వచ్చే అవకాశం ఉంటుంది.

5 / 5
అందువల్ల ఎండు చేపలను వండే ముందు అవి శుభ్రంగా ఉన్నాయా లేదా అని తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. బూజు పట్టినట్లు కనిపించినా లేదా అసాధారణమైన వాసన వస్తున్నా వాటిని అస్సలు ఉపయోగించకూడదు. ఎటువంటి చెడు వాసన రాకుండా, నాణ్యంగా, తాజాగా ఉన్నప్పుడు మాత్రమే ఎండు చేపలను తినడం ఆరోగ్యానికి సురక్షితం. సరైన శుభ్రత, జాగ్రత్తలతో చలికాలంలో ఎండు చేపల రుచిని, పోషకాలను ఆస్వాదించవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us