
కొందరికి ముఖం మీద ఇంకా మెడ చుట్టూ పులిపిర్లు ఉంటాయి. ఇవి చూడటానికి కొంత ఇబ్బందిగా ఉంటాది. వాటిని నేరుగా కట్ చేస్తే చాలా నొప్పి వస్తుంది, ఇంకా మళ్లీ వస్తాయేమో అని భయపడుతుంటారు. వీటిని తగ్గించుకోవడానికి డబ్బులు పెట్టి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. పాత కాలం చిట్కాతో వీటిని తగ్గించుకోవచ్చు.

ఇవి ఎక్కువగా మహిళల్లోనే కనిపిస్తాయి .మీ కిచెన్ లో దొరికే కొన్ని పదార్దాలతోనే వీటిని వదిలించుకోవచ్చు. ఇంకా మీకు నొప్పి కూడా ఉండదు. వీటితో ఈ పులిపిర్లను ఈజీగా తరిమికొట్టచ్చు. మరి, అసలు లేట్ చేయకుండా ఈ టిప్ ఏంటి? దీనిని ఎలా తయారు చేయాలి అనేవి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఈ పులిపిరి కాయలు గోధుమ రంగులో చిన్న చిన్న బొడిపెలుగా ఉంటాయి. ఇవి ఎలాంటి నొప్పి ఉండవు. ఇవి ఒత్తిడి పడేచోట కొద్దిగా ఇబ్బందినీ కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా ముఖంపైనా ఇంకా మెడపైనా కూడా వస్తుంటాయి. వీటిని తొలగించుకోవడానికి ఇంటి చిట్కాలు మంచిగా పనిచేస్తాయి.

ఒక గిన్నెలో బేకింగ్ పౌడర్, కొద్దిగా టూత్ పేస్ట్, ఆముదం కొంచం వేసి దీనిని బాగా కలపాలి. దీనిని పులిపిర్ల మీద రాసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా రాత్రి సమయంలో దీనిని తీసుకుని పులిపిర్ల మీద దీనిని రాసి అలా వదిలేయాలి. ఆ తరవాత రోజు దీనిని తీసేయాలి. ఇలా చేస్తే పులిపిర్లు మొత్తం వెంటనే రాలిపోతాయి

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)