Gold: కూరగాయలు కొన్నంత ఈజీగా బంగారం కొనాలంటే ఈ దేశాల్లోనే! చాలా చీప్‌

Updated on: Apr 22, 2026 | 8:28 AM

ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ, దుబాయ్, హాంగ్‌కాంగ్, సింగపూర్ వంటి దేశాల్లో తక్కువ ధరకు లభిస్తుంది. పన్ను విధానాలు, దిగుమతి సుంకాలు, స్థానిక మార్కెట్ పరిస్థితులే దీనికి ప్రధాన కారణాలు. దుబాయ్ తక్కువ సుంకాలకు, సింగపూర్ పెట్టుబడి బంగారంపై GST మినహాయింపుకు ప్రసిద్ధి.

1 / 5
ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉండటంతో బులియన్ మార్కెట్‌పై ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్‌ వంటి దేశాల్లో బంగారం ధరలు సాధారణ ప్రజలకు భారంగా మారుతున్నాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం బంగారం తక్కువ ధరకు లభించడం గమనార్హం. తాజా నివేదికల ప్రకారం బంగారం అత్యంత చవకగా లభించే దేశాల్లో దుబాయ్‌, హాంగ్‌కాంగ్‌, సింగపూర్‌, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్‌ వంటి దేశాలు ముందున్నాయి.

2 / 5
ఈ దేశాల్లో బంగారం ధర తక్కువగా ఉండటానికి ప్రధాన కారణాలు పన్ను విధానం, దిగుమతి సుంకాలు, స్థానిక మార్కెట్ పరిస్థితులే. ఉదాహరణకు దుబాయ్‌ ప్రపంచ బంగారం వాణిజ్య కేంద్రంగా పేరుగాంచింది. ఇక్కడ బంగారంపై దిగుమతి సుంకాలు తక్కువగా ఉండటం, పర్యాటకులకు అనుకూలంగా పన్ను విధానాలు ఉండటం వల్ల ధరలు ఇతర దేశాల కంటే తక్కువగా ఉంటాయి.

3 / 5
అలాగే హాంగ్‌ కాంగ్‌లో పెట్టుబడి బంగారంపై ఎలాంటి పన్ను ఉండదు. దీనివల్ల అక్కడ బంగారం కొనుగోలు మరింత చౌకగా మారుతుంది. సింగపూర్‌ కూడా ఇదే తరహాలో బంగారం పెట్టుబడిపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వడంతో బంగారం ధరలు తక్కువగా ఉంటాయి. దీంతో ఈ దేశం బంగారం వ్యాపారానికి ముఖ్య కేంద్రంగా నిలిచింది.

4 / 5
ఇక స్విట్జర్లాండ్‌ విషయానికి వస్తే ప్రపంచంలోనే ప్రముఖ బంగారం శుద్ధి కేంద్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ భారీ స్థాయిలో బంగారం శుద్ధి, నిల్వ జరుగుతుంది. ఈ కారణంగా సరఫరా ఎక్కువగా ఉండటం వల్ల ధరలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదే విధంగా థాయ్‌లాండ్‌లో కూడా బంగారం మార్కెట్ చురుకుగా ఉండటం, స్థానిక డిమాండ్-సరఫరా సమతుల్యత కారణంగా ధరలు పోటీగా ఉంటాయి.

5 / 5
అయితే నిపుణులు చెబుతున్నదేమిటంటే విదేశాల్లో బంగారం చవకగా ఉన్నప్పటికీ, భారతదేశానికి తీసుకురావడంపై కస్టమ్స్ సుంకాలు, నియమాలు వర్తిస్తాయి. అందువల్ల కొనుగోలు చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం అవసరం. మొత్తానికి పన్ను విధానాలు, మార్కెట్ పరిస్థితులే దేశానికోలా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయని చెప్పవచ్చు.

Follow Us