6. కొంటాం సరే.. మరి అమ్మాలనుకున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటి?
గోల్డ్ ఆర్నమెంట్స్ కొనేటప్పుడు మేకింగ్ చార్జెస్, ప్రాఫిట్ మార్జిన్, జీఎస్టీ ఇలాంటివన్నీ వర్తిస్తాయి. తిరిగి అమ్మేటప్పుడు మాత్రం ఇవేవే తిరిగి రావనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. పైగా పాత బంగారానికి వేస్టేజ్ రూపంలో కొంత తగ్గించే అవకాశం ఉంది. సాధారణంగా రాళ్లు ఉన్న ఆభరణాలకు ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది. అందువల్ల రాళ్లు ఎక్కువగా లేని ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడం బెటర్. సాధారణంగా బంగారాన్ని పెట్టుబడి పేరిట కొనుగోలు చేసేవారు కాయిన్లు, బార్ల రూపంలో కొనడం చేయడం మంచిది. సోవరీన్ గోల్డ్ బాండ్ స్కీమ్ , గోల్డ్ ETFల ద్వారా డిజిటల్‌గా బంగారం కొనే అవకాశాలను కూడా పరిశీలించడం మంచిది.
ఇక చివరిగా చెప్పొచ్చేదేంటంటే... భారతీయుల నమ్మకం ప్రకారం బంగారం సంపదకు ప్రతీక. ఏడాదంతా బంగారం కొనే స్థోమత అవకాశం లేకపోయినా... కనీసం అక్షయ తృతియ పేరుతోనైనా పసిడిని కొనుగోలు చెయ్యడం వల్ల కేవలం ఆడవాళ్ల పెదవులపై చిరునవ్వును చూడటమే కాదు... భవిష్యత్తులో అనుకోని అవసరం ఏది వచ్చినా... నేనున్నాన్న భరోసాని, ధైర్యాన్ని అన్నింటికీ మించి అవసరమైన ధనాన్ని ఇస్తుంది బంగారం. అందుకే ఈ అక్షయ తృతియ సెంటిమెంట్ ఇండియాలో అంత బాగా వర్కౌట్ అవుతోంది.