Blue Colour Plate: బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ వెనుక ఇంత కథ ఉందా..? వీరి వాహనాలకు మాత్రమే ఎందుకిస్తారు..?

Updated on: Feb 24, 2026 | 5:01 PM

బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ వాహనాలను మీరు ఎప్పుడైనా చూశారా.. చాలా అరుదుగా ఇలాంటి వాహనాలు కనిపిస్తాయి. వైట్, గ్రీన్, రెడ్ కలర్ నెంబర్ ప్లేట్స్ ఉన్న వెహికల్స్ తరచూ కనిపిస్తాయి. కానీ ఈ బ్లూ కలర్ ఎలాంటి వాహనాలకు ఉపయోగిస్తారంటే..?

1 / 5
రోడ్లపై మనకు రోజూ కనిపించే వాహనాల నెంబర్ ప్లేట్లు ప్రత్యేకంగా ఉంటాయి. తెలుపు, పసుపు, గ్రీన్ రంగుల్లో నెంబర్ ప్లేట్లను ఎక్కువగా రోడ్లపై చూస్తుంటాం. తెలుపు రంగును వ్యక్తిగత వాహనాలకు, పసుపు రంగు నెంబర్ ప్లేట్లను కమర్షియల్ వెహికల్స్‌కు ఉపయోగిస్తారు. ఇక ఎలక్ట్రిక్ వాహనాలకు గ్రీన్ కలర్ నెంబర్ ప్లేట్లు కేటాయిస్తారు.

2 / 5
ఇక రెడ్ కలర్ నెంబర్ ప్లేట్లను కూడా మీరు చూసే ఉంటారు. రాష్ట్రపతి, గవర్నర్ వంటివారి అధికారిక వాహనాలకు రెడ్ కలర్ నెంబర్ ప్లేట్స్ ఉంటాయి. ఇక ప్రభుత్వ వాహనాలకు కూడా రోడ్ కలర్ ఉపయోగిస్తారు. కొన్నిచోట్ల వెహికల్ కొనుగోలు చేసినప్పుడు తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం రెడ్ కలర్  నెంబర్ ప్లేట్లు వాడుతున్నారు.

3 / 5
అయితే బ్లూ కలర్ నెంబర్ ప్లేట్స్ మీరు ఎప్పుడైనా చూశారా..? ఈ వెహికల్స్ చాలా అరుదుగా కనిపిస్తాయి. విదేశీ దౌత్యవేత్తలు, రాయబార కార్యాలయాలకు చెందిన వెహికల్స్‌కు ఈ కలర్ వాడతారు. దౌత్య సిబ్బంది, అధికారులను సులువుగా గుర్తించడానికి ఇది సహాయపడుతుంది. అధికారిక ప్రయోజనం కోసమే ఈ వాహనాలు ఉపయోగిస్తారు.

4 / 5
బ్లూ కలర్ బ్యాగ్రౌండ్‌పై తెలుపు అక్షరాలతో ఈ నెంబర్ ప్లేట్స్ ఉంటాయి. కొన్ని వాహనాలపై సీడీ, సీసీ వంటి గుర్తులు ఉంటాయి. సీడీ అంటే దౌత్యవేత్తలు, సీసీ అంటే కాన్సులేట్ అధికారులు అని అర్ధం. దీని వల్ల ట్రాఫిక్ పోలీసులు వీరి వాహనాలను సులభంగా గుర్తు పట్టొచ్చు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ కలర్ నెంబర్ ప్లేట్ వాడాల్సి ఉంటుంది.

5 / 5
దౌత్యవేత్తలకు అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ప్రత్యేక హక్కులు, అధికారులు ఉంటాయి. దీని వల్ల వారికి ప్రత్యేక ప్రొటోకాల్ నిబంధనలు ఉంటాయి. అందులో భాగంగా వారి వాహనాలకు బ్లూ కలర్ నెంబర్ ప్లేట్ ఉంటుంది. ఒక అధికారిక హోదాగా దీనిని పరిగణిస్తారు.

Follow Us