
ఎక్కడికైనా వెళ్లాలంటే బైక్ అనేది తప్పనిసరిగా మారింది. దూరపు ప్రాంతాలకు వెళ్లాలంటే కారు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. కారులో లగ్జరీ ప్రయాణంతో పాటు పొల్యూషన్ నుంచి తప్పుకోవచ్చు. మార్కెట్లో తక్కువ ధరకే బైక్‌లు, కార్లు లభిస్తుండటంతో సామాన్యులు కూడా కొనుగోలు చేస్తున్నారు. ఇక బైక్ లేదా కారు కలిగి ఉన్నవారు ఇన్యూరెన్స్ తీసుకోవడం అనేది చాలా అవసరం. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న క్రమంలో ఇన్యూరెన్స్ మీ వెహికల్‌కు రక్షణ కవచంగా ఉంటుంది.

వెహికల్ ఇన్యూరెన్స్‌ను ప్రస్తుతం చాలా కంపెనీలు అందిస్తున్నాయి. మీరు అందులో మంచి కంపెనీని ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకోసం అన్ని కంపెనీల గురించి తెలుసుకోండి. వారు అందిస్తున్న ఫీచర్లు, క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో వంటి బెనిఫిట్స్‌ను చెక్ చేయండి. వీటిల్లో త్వరగా సేవలు అందించే కంపెనీని ఎంచుకోండి

ఇక ఇన్యూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ బెనిఫిట్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. కొంతమంది ప్రీమియం తగ్గించుకునేందుకు దీనిని తగ్గించుకుంటారు. దీని వల్ల మీకే నష్టం జరుగుతుంది. మీ వెహికల్ డ్యామేజ్ లేదా చోరీకి గురైన సమయంలో ఇన్యూరెన్స్ కంపెనీ నుంచి ఎక్కువ అందుకోలేరు. ఇక మీరు ఒక ఏడాదిలో ఇన్యూరెన్స్ క్లెయిమ్ చేసుకోకపోతే తర్వాతి ఇయర్‌లో చెల్లించే ప్రీమియంలో కంపెనీలు డిస్కౌంట్స్ ఇస్తుంటాయి.

ప్రీమియంపై డిస్కౌంట్స్ ఇచ్చే కంపెనీలను సెలక్ట్ చేసుకోండి. ఇక వెహికల్ దొంగతనం కాకుండా యాంటీ థెప్ట్ డివైజ్‌లను అమర్చుకోండి. జీపీఎస్ ట్రాకర్టలు, గేర్ లాక్స్, ఇంజిన్ ఇమ్మోబిలైజర్లు వంటి వాటిని అమర్చుకోండి. ఇలాంటివి అమర్చుకున్న వాహనాలకు కంపెనీలు ప్రీమియంపై ఆఫర్లు ఇస్తున్నాయి.

ఇక ఏదోక పాలసీ తక్కువ ధరకే వస్తుందని అసలు తీసుకోవద్దు. పాలసీ గురించి బాగా రీసెర్చ్ చేయండి. మీకు బాగా ఉపయోగపడే పాలసీని మాత్రమే ఎంచుకోవడం వల్ల మీ వెహికల్‌కు రక్షణ ఉంటుంది.