
ఏపీలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముంబై-బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను నవంబర్ 1న రైల్వేశాఖ ప్రారంభించింది. బెంగళూరులో ఈ ట్రైన్‌ను పచ్చజెండా ఊపి రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. నవంబర్ 2వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి వచ్చింది. ఏపీలోని అనంతపురం, గుంతకల్ రైల్వే స్టేషన్లలో ఇది ఆగనుంది.

ఈ ట్రైన్ కాకతో రాయలసీమ ప్రాంతాల ప్రజలు దీని ద్వారా సులువుగా బెంగళూరు, ముంబైకి తక్కువ సమయంలో చేరుకోవచ్చు. ముంబై-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు(27651) మంగళవారం మినహా మిగతా రోజుల్లో ప్రతీ రోజు రాత్రి 8.10 గంటలకు ముంబైలో బయల్దేరుతుంది. ఇది గుంతకల్ స్టేషన్‌కు మరుసటి రోజు ఉదయం 07.30 చేరుకోనుండగా.. అనంతపురంకు ఉదయం 08.30 గంటలకు చేరుకుంటుంది.

అనంతపురం నుంచి 08.40 గంటలకు బయల్దేరనున్న ఈ రైలు బెంగళూరుకు మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటుంది. అంటే మూడు గంటల 20 నిమిషాల్లోనే అనంతపురం నుంచి బెంగళూరుకు చేరుకోవచ్చు. ఇక బెంగళూరు-ముంబై(27652) రైలు బెంగళూరులో రాత్రి 7.45 గంటలకు బయల్దేరుతుంది. ఇది అనంతపురానికి 10.30కి, గుంతకల్‌కి 11.20 గంటలకు చేరుకుంటుంది.

ఈ రైలు మరుసటి రోజు ఉదయం 11.55 గంటలకు ముంబైకి చేరుకుంటుంది. బెంగళూరు-ముంబై మార్గంలో సోమవారం మినహా మిగతా రోజుల్లో అందుబాటులో ఉంటుంది. మెయింటనెన్స్ కోసం ఒక రోజు నిలిపివేయనున్నారు. ఈ రైల్లో మొత్తం 16 కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

ఈ రైలు గరిష్టంగా గంటకు 130 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయనుంది. ఈ మార్గంలో రెండు వందే భారత్ స్లీపర్ సెట్లను నడుపుతున్నారు. రాత్రిపూట ప్రయాణం చేసేవారికి మెరుగైన సౌకర్యం అందుబాటులోకి రానుంది. ముంబై-బెంగళూరు మధ్య అనుసంధానాన్ని మరింత పెంచనుంది. ఈ రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణం మరింత సౌకర్యవంతం కానుంది.