UPI Payments: మీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.. చాలామందికి తెలియని విషయమిదే..

Updated on: Oct 13, 2026 | 12:33 PM

యూపీఐ చెల్లింపులు చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. సేవింగ్స్ అకౌంట్, రూపే క్రెడిట్ కార్డులు ఉపయోగించి చెల్లింపులు చేయడం గురించి మనందరికీ తెలిసిందే. అయితే మరో విధానం ద్వారా కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ పేమెంట్స్ చేయవచ్చు. ఇందుకు మీ అకౌంట్లో డబ్బులు కూడా ఉండాల్సిన అవసరం లేదు.

1 / 5
యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయాలంటే బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లేదా రూపే క్రెడిట్ కార్డు వల్ల మాత్రమే సాధ్యమవుతుందని చాలామంది భావిస్తుంటారు. కానీ అది చాలా తప్పు. ఆ రెండూ లేకపోయినా వివిధ మార్గాల ద్వారా యూపీఐ చెల్లింపులు సులువగా చేయవచ్చు. వాటిల్లో ఒకటి యూపీఐ క్రెడిట్ లైన్. కొన్ని బ్యాంకులు యూపీఐ క్రెడిట్ లైన్లను జారీ చేస్తున్నాయి. వీటి ద్వారా మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ ట్రాన్సాక్షన్లు చేయవచ్చు.

2 / 5
బ్యాంకులు మంజూరు చేసే క్రెడిట్ లైన్లను యూపీఐతో లింక్ చేసుకోవాలి. అనంతరం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి క్రెడిట్ లైన్ ద్వారా సులువుగా చెల్లింపులు చేయవచ్చు. దీనికి సేవింగ్స్ అకౌంట్, రూపే క్రెడిట్ కార్డు అక్కర్లేదు. ప్రత్యేకంగా రూపొందించిన క్రెడిట్ లైన్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. ఈ వ్యవస్థను ఆర్బీఐ అందుబాటులోకి తీసుకొచ్చింది.

3 / 5
సెప్టెంబర్ 2023లో బ్యాంక్ క్రెడిట్ లైన్లు ఉపయోగించి యూపీఐ ద్వారా లావాదేవీలు చేసుకునే సదుపాయాన్ని ఆర్బీఐ అందుబాటులోకి తెచ్చింది. బ్యాంక్ ఇప్పటికే మీకు క్రెడిట్ లైన్ జారీ చేసి ఉంటే యూపీఐకు అనుసంధానించుకుని చెల్లింపులు చేసుకోవచ్చు. తొలుత ప్రధాన బ్యాంకులకు క్రెడిట్ లైన్ జారీ చేసే అధికారం ఇవ్వగా.. ఆ తర్వాత స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు కూడా ఆర్బీఐ విస్తరించింది. అయితే క్రెడిట్ లైన్‌కు వడ్డీ, బిల్లింగ్ సైకిల్, లేట్ ఫీజులు, క్రెడిట్ పరిమితి వంటివి వర్తిస్తాయి.

4 / 5
క్రెడిట్ లైన్ వ్యవస్ధ ఎలా పనిచేస్తుందంటే.. ఉదాహరణకు బ్యాంక్ మీకు రూ.50 వేల పరిమితితో క్రెడిట్ లైన్ మంజూరు చేసిందనుకుందాం. మీరు యూపీఐ ద్వారా రూ.8 వేలు చెల్లింపులు చేస్తే.. బ్యాంక్ వీటిని వ్యాపారికి చెల్లిస్తుంది. మీ క్రెడిట్ పరిమితి రూ.42 వేలకు తగ్గుతుంది. మీరు చేసిన రూ.8 వేల చెల్లింపు బకాయి క్రెడిట్‌గా మారుతుంది.

5 / 5
యూపీఐ క్రెడిట్ లైన్ అనేది దానిని ఒక వ్యక్తిగత రుణంగా పరిగణించకూడదు. ప్రతీ వినియోగదారుడికి ఖచ్చితంగా యూపీఐ క్రెడిట్ లైన్ మంజూరు కాదు. కేవలం అర్హులైన కస్టమర్లకు మాత్రమే బ్యాంకులు మంజూరు చేస్తాయి. నియమ, నిబంధనల ప్రకారం మీరు ఖర్చు చేసిన సొమ్మును గడువులోగా చెల్లించాల్సి ఉంటుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us