Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు శుభవార్త..

Updated on: Feb 01, 2026 | 2:10 PM

కేంద్ర బడ్జెట్‌లో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే పలు నిర్ణయాలు ఉన్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువు పొడిగింపుతో పాటు జిల్లాకో లేడీస్ హాస్టల్, మహిళల కోసం గ్రామాల్లో స్టోర్లు వంటి నిర్ణయాలు ఉన్నాయి. ఇక బడ్జెట్‌లో ఏవేవేం ఉన్నాయంటే..

1 / 5
కేంద్ర బడ్జెట్‌లో సామాన్యులకు, మధ్యతరగతి వారికి పలు ఊరట కలిగించే అంశాలు ఉన్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ (ITR) ఫైలింగ్ గడవును జూలై 31 వరకు పెంచారు. రిటర్న్స్ దాఖలులో ఏవైనా తప్పులుంటే మార్చి 31 వరకు సరిచేసుకోవచ్చు. ఇక 17 రకాల క్యాన్సర్ మందుల మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. దీనివల్ల త్వరలో  క్యాన్సర్ చికిత్స ఖర్చు తగ్గనుంది.

2 / 5
ఇక భారత్ నుంచి విదేశాలకు చదువు కోసం లేదా టూర్ల కోసం పంపే నగదుపై కట్ అయ్యే పన్ను (TCS)ను 20% నుండి 2%కి తగ్గిస్తూ బడ్జెట్‌లో నిర్ణయించారు. ఇక వాహన ప్రమాదాల్లో బాధితులకు కోర్టు ద్వారా వచ్చే పరిహారం మీద వచ్చే వడ్డీకి ఇకపై ట్యాక్స్ ఉండదు. మహిళా వ్యాపారుల కోసం షీ మార్ట్స్ పేరుతో ఊర్లలో ప్రత్యేక షాపులు ఏర్పాటు చేయనున్నారు.

3 / 5
ఇక ఐటీ కంపెనీలకు పన్ను మినహాయింపులు ఈ బడ్జెట్‌లో పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ ఐటీ రంగానికి ఇది చాలా మేలు చేయనుందని తెలుస్తోంది. అలాగే క్లౌడ్ డేటా సెంటర్లకు కూడా పన్ను ఉండదు. ఇక ఫార్మా కంపెనీల కోసం 'బయోఫార్మా శక్తి' అనే స్కీం తెచ్చారు. ఇది ఏపీ, తెలంగాణలోని మందుల కంపెనీలకు ఉపయోగపడనుంది.

4 / 5
తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలు, చార్మినార్ లాంటి చారిత్రక ప్రదేశాలను మరింత అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం టూరిస్ట్ గైడ్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు బడ్జెట్‌లో తెలిపారు.ఇక రైతులకు నీటి ఎద్దడి రాకుండా 500 రిజర్వాయర్లను అభివృద్ధి చేస్తారు. అలగే వాల్‌నట్స్, బాదం వంటి తోటల పెంపకానికి ప్రోత్సాహం ఇస్తారు.

5 / 5
ఇక తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నై, బెంగళూరు, పుణె వంటి నగరాలకు విద్య,  ఉపాధి, వ్యాపార అవసరాల కోసం చాలామంది వెళ్తుంటారు. దీంతో హైస్పీడ్ రైల్ కారిడార్ల ఏర్పాటు వల్ల ప్రయాణం వేగవంతం కావడంతో పాటు కొత్త పరిశ్రమలు కూడా రానున్నాయి. దీని వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.