Smartphones 2022: భారత మార్కెట్‌లో దుమ్ములేపిన టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. అగ్రస్థానంలో ఏ ఫోన్ నిలిచిందంటే..

|

Jan 13, 2023 | 12:30 PM

గతేడాది అంటే 2022 సంవత్సరం నాలుగో త్రైమాసికంలో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను కౌంటర్ పాయింట్ రీసెర్చ్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఆపిల్ ఐఫోన్ 13 అగ్రస్థానంలో నిలిచింది. ఇక మిగిలిన స్థానాలలో ఏయే కంపెనీల ఫోన్‌లు నిలిచాయో తెలుసుకుందాం..

1 / 5
Apple iPhone 13: ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ల జాబితాలో మొదటి స్థానంలో ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఆపిల్ ఐఫోన్ 13 మార్కెట్ వాటా 4 శాతంగా ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.64,900. 6.1 అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లేతో పాటు 12MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది ఈ ఐఫోన్.

2 / 5
Samsung Galaxy M13: ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్న ఈ సామ్సంగ్ గెలాక్సీ ఎమ్13 ప్రారంభ ధర రూ.11,000.  భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్‌లలో ఇది కూడా ఒకటి. 6.6 అంగుళాల FHD + డిస్ప్లే , 6,000 mAh భారీ బ్యాటరీతో ఈ ఫోన్ కస్టమర్ల ఆదరణను పొందుతోంది.

3 / 5
Redmi A1: Xiaomi కంపెనీకి చెందిన ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్  జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.6,000. 6.52 HD + డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 8MP ప్రైమరీ కెమెరాఈ ఫోన్‌లో ఆకర్షణీయ ఫీచర్లుగా ఉన్నాయి.

4 / 5
Samsung Galaxy A04s: ఈ జాబితాలో సామ్స్ంగ్‌ కంపెనీకి చెందిన మరో ఫోన్ Samsung Galaxy A04s  నాలుగో స్థానంలో ఉంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.13,499.  గతేడాది ఆగస్టులో విడుదలైన ఈ ఫోన్ Exynos 850 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ, 128 GB స్టోరేజ్‌ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

5 / 5
realme C35: ఈ గతేడాది బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో realme C35 టాప్‌5 లో చివరి స్థానంలో ఉంది. దీని  ప్రారంభ ధర రూ.11,999. 6.6 అంగుళాల డిస్ప్లే, Unisoc టైగర్ T616 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ వంటి మెరుగైన ఫీచర్లను కలిగిన ఈ ఫోన్ మార్కెట్ వాటా 3 శాతంగా ఉంది.