
Today Gold Rate: బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. ఇండియా బులియన్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర ఈ వారం రూ. 1860 తగ్గి 10 గ్రాములకు రూ.1,54,800 కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 1700 రూపాయల వరకు తగ్గి రూ.1,41,900 వద్ద ట్రేడవుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాములపై 1390 రూపాయలు తగ్గి ప్రస్తుతం రూ.1,16,100 వద్ద కొనసాగుతోంది.

ఇక వెండి విషయానికొస్తే దీనిలో పెద్దగా మార్పు లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర 2,50,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. అయితే బంగారం ధరలు ఒడిదొడుకుల మధ్య కొనసాగుతుంటే, వెండి ధరల్లో మాత్రం పెద్దగా మార్పు ఉండటం లేదు.

ధర తగ్గిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,54,800 వద్ద కొనసాగుతుండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,41,900 వద్ద కొనసాగుతోంది. అయితే బంగారం, వెండి ధరలను IBJA రోజుకు రెండుసార్లు ఉదయం, సాయంత్రం సెషన్లలో విడుదల చేస్తుంది. అంతర్జాతీయంగా, బంగారం ధర ఔన్సుకు సుమారు $4,500, వెండి ధర ఔన్సుకు సుమారు $66 గా ఉండేది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరగడం వల్లే బంగారం, వెండి ధరలు తగ్గాయి. అమెరికా ఇరాన్‌పై తరచుగా దాడులు చేస్తుండగా, ఇరాన్ కూడా మధ్యప్రాచ్యంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. దీనివల్ల బాండ్ల రాబడులు, డాలర్, ముడి చమురు కూడా బలపడ్డాయి.

పశ్చిమాసియాలో భగ్గుమన్న మంటలతో పసిడి ధరలు నేలచూపులు చూశాయి. ఈ నెల ఆరంభం నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. గ్లోబల్ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ సూచీ మళ్లీ బలం పుంజుకోవడం, యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ పెరగడంతో పసిడికి డిమాండ్ తగ్గింది. సాధారణంగా డాలర్ వ్యాల్యూ పెరిగినప్పుడు విదేశీ ఇన్వెస్టర్లకు బంగారం కొనుగోలు ఖరీదైనదిగా మారి డిమాండ్ క్షీణిస్తుంది.