బజాజ్ చేతక్.. బజాజ్ చేతక్ అప్‌గ్రేడెడ్ వెర్షన్ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. కొత్త మోడల్ పరిధిని 110కిమీలకు పెంచి ఇస్తారని పలువురు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత మోడల్ 2.9కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది 95 కిమీల సర్టిఫైడ్ పరిధిని కలిగి ఉంటుంది. రానున్న కొత్త మోడల్ 4కేడబ్ల్యూహెచ్ పెద్ద బ్యాటరీని కలిగి ఉండవచ్చు అందువల్ల 110 కిమీల పరిధిని ఇచ్చే అవకాశం ఉంది. బలమైన స్టీల్ యూనిబాడీ, బ్లూటూత్ కనెక్టివిటీ, జియో-ఫెన్సింగ్, ఓటీఏ అప్‌డేట్‌లు, కలర్ ఎల్సీడీ కన్సోల్, పార్కింగ్ కోసం రివర్స్ మోడ్ ఉంటుంది.